డిగ్రీ చేశానని నమ్మించాడు.. అది తెలిసి ఉహించని షాకిచ్చిన వధువు.. దెబ్బకు వరుడి ఫ్యూజ్‌లు ఔట్..

ఇటీవల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు.. పీటల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మరికొన్ని నిశ్చితార్థం రోజునే రద్దవుతున్నాయి. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగానే..

డిగ్రీ చేశానని నమ్మించాడు.. అది తెలిసి ఉహించని షాకిచ్చిన వధువు.. దెబ్బకు వరుడి ఫ్యూజ్‌లు ఔట్..
Engagement

ఇటీవల పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు.. పీటల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మరికొన్ని నిశ్చితార్థం రోజునే రద్దవుతున్నాయి. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగానే.. ప్రస్తుతం అమ్మాయిలు కూడా తమ నిర్ణయాలను నిర్మోహ్మటంగా చెప్పేస్తున్నారు. ఇక చిన్న చిన్న కారణాలతోనే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెద్దలు కుదుర్చిన పెళ్లి సంబంధంలో వరుడు, వధువు మధ్య సరైన అవగాహన లేకుండా కూడా పెళ్లిళ్లు అగిపోయిన సంఘటనలు చాలానే చుశాం. ముఖ్యంగా పెళ్లి గురించి అమ్మాయిలు ఎన్నో కళలు కంటారు. ముఖ్యంగా వరుడి గుణగణాలు.. స్వభావం.. చదువు.. ఉద్యోగం విషయంలో ముందే ఒక అవగాహనకు వచ్చేస్తుంటారు. చదువుకున్న అమ్మాయిలు తమకు కాబోయే వరుడు కూడా దాదాపు తనలాగే విద్యాబ్యాసం పూర్తి చేసినవాడు కావాలనుకుంటారు. ఇప్పటిరోజుల్లో చదువుకు, ఉద్యోగం చేసే అబ్బాయిలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

కానీ తాజాగా ఓ అమ్మాయి తనకు కాబోయే భర్త డిగ్రీ పూర్తి కాలేదని వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపింది. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వల్లాపురానికి చెందిన బీటెక్ చదువుకున్న ఓ యువతికి ఈర్లపూడిలోని భాగ్యతండాకు చెందిన ఇక్బాల్‏తో వివాహం కుదిరింది. ఇక్బాల్ డిగ్రీ పూర్తిచేసినట్లుగా పెళ్లి చూపుల సమయంలో చెప్పాడు. ఈ విషయాన్ని యువతి కుటుంబసభ్యులు కూడా నమ్మి.. నిశ్చితార్థానికి ముహర్తం పెట్టుకున్నారు. ఆదివారం యువతి ఇంటి వద్ధ నిశ్చితార్థం ఏర్పాటు చేయగా… ఇక్బాల్ డిగ్రీ పూర్తి చేయలేదని.. మధ్యలోనే ఆపేసినట్లుగా తెలిసిందే. దీంతో ఆ యువతి తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో యువతి ఇంటి దగ్గర ఘర్షణకు దిగారు వరుడి కుటుంబసభ్యులు. ఈ ఘర్షణలో యువతి సోదరుడు జాన్ పాషాకు తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. సెలబ్రెటీలకు బిగుస్తున్న ఉచ్చు.. ఈరోజు నవదీప్‏పై అధికారుల ప్రశ్నల వర్షం..

Bheemla Nayak: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పవర్ స్టార్ మానియా.. రికార్డులు తిరగరాస్తున్న భీమ్లానాయక్

Bigg Boss 5 Telugu: అందుకే అతను నన్ను నామినేట్ చేశాడు.. అప్పటి నుంచే అంత గ్రడ్జ్ పెట్టుకున్నాడు.. శివాలెత్తిన సరయు

Click on your DTH Provider to Add TV9 Telugu