Telangana: అర్థరాత్రివేళ నడిరోడ్డుపై ఎర్రటి ముద్దలు.. ఏంటా అని చూసి హడలిపోయిన జనాలు..

Telangana: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. నడిరోడ్డుపై నిమ్మకాయలు, కోడిగుడ్డు, జిల్లేడు పూలు, అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి క్షుద్ర పూజలు..

Telangana: అర్థరాత్రివేళ నడిరోడ్డుపై ఎర్రటి ముద్దలు.. ఏంటా అని చూసి హడలిపోయిన జనాలు..
Black Magic
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 13, 2021 | 9:15 AM

Telangana: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. నడిరోడ్డుపై నిమ్మకాయలు, కోడిగుడ్డు, జిల్లేడు పూలు, అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి క్షుద్ర పూజలు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఊరి బయట అర్ధరాత్రి క్షుద్ర పూజలు, చేతబడి చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే కూడా భయపడిపోతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లే వాళ్లు హడలిపోతున్నారు. ముఖ్యంగా ఆది, గురు వారాలు వచ్చాయంటే చాలు.. ఈ ప్రాంతంలో ఏదో ఒక చోట క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. అయితే, అనుకోకుండా వాటిపై నుంచి దాటడంతో అనారోగ్యానికి గురవుతామని అనుమానంతో జనాలు భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి వాటి కారణంగా కాస్త చికటిపడితే చాలు రోడ్డుపైకి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.

ఏది ఏమైనా.. అంతరిక్షంలోకి అడుగిడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా జనం మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడటం సరికాదని జన విజ్ఞాన వేదిక సభ్యులు అంటున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాల ఊబి నుండి బయటకు రావాలని ప్రజలను పోలీసులు సైతం కోరుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, పోలీసుల హెచ్చరికలేవీ కేటుగాళ్లు లక్ష్య పెడుతున్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో తరచుగా ఎక్కడో ఒక చోట మంత్రగాళ్లు క్షుద్రపూజలు, చేతబడి పూజలు చేస్తూనే ఉన్నారు. వీరి చర్యలతో స్థానిక జనాలు భయంతో అల్లాడుతూనే ఉన్నారు.

Also read:

US Open 2021: నోవాక్‌ జకోవిచ్‌కు మరోసారి షాకిచ్చిన రష్యా ఆటగాడు.. యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన మెద్వెదెవ్‌

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు అవుట్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆ కంటెస్టెంట్

Hyderabad: మెదక్‌లో మంచి వైద్యుడిగా గుర్తింపు.. హైదరాబాద్‌కు వచ్చి ప్రాణాలు విడిచాడు.. కారణమేంటంటే..