Hyderabad: అనుమాన భూతం పట్టిన భర్త.. పెళ్లైన రెండేళ్లకే వేధింపులు భరించలేక వివాహిత..

|

Feb 22, 2022 | 11:03 AM

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. కాయాకష్టం చేసుకుంటూ కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చాడు. కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. కానీ ఆ తండ్రి సంతోషం మున్నాళ్ల..

Hyderabad: అనుమాన భూతం పట్టిన భర్త.. పెళ్లైన రెండేళ్లకే వేధింపులు భరించలేక వివాహిత..
Follow us on

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. కాయాకష్టం చేసుకుంటూ కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చాడు. కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. కానీ ఆ తండ్రి సంతోషం మున్నాళ్ల ముచ్చటే అయింది. ఎన్నో కలలతో అత్తింటికి బయల్దేరిన ఆ యువతికి.. అత్తింటి రూపంలో వేధింపులు మొదలయ్యాయి. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి గోడు వెల్లబోసుకుంది. కుటుంబసభ్యులు సర్దిచెప్పి, మళ్లీ అత్తింటికి పంపించారు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని, కన్నీరు మున్నీరయ్యారు. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తామామలు తమ కూతురిని చిత్ర హింసలు పెట్టారని, వారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

కర్ణాటక బీదర్‌కు చెందిన మచ్ఛీంద్రా రాథోడ్.. కుటుంబసభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. మచ్ఛీంద్రా రాథోడ్ కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. 2020 మార్చిలో కూతురుకి ఏఎస్‌రావు నగర్‌లో ఉంటున్న సచిన్‌ జాదవ్‌తో వివాహం చేశారు. ఈ దంపతులకు 13 నెలల పాప ఉంది. కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ భార్యను అనుమానించడం, వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఇరువురి మధ్య ఘర్షణలూ చోటు చేసుకున్నాయి. భర్త వేధింపులు ఎక్కువవడంతో ప్రియాంక తన తల్లిదండ్రులకు చెప్పింది. సచిన్ కు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా.. వేధింపులు మరీ ఎక్కువయ్యాయి.

ఈ నెల 20న సచిన్, ప్రియాంక ల మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రియాంక తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తల్లిదండ్రులు కూతురుకు నచ్చజెప్పి.. కుమారుడు సంతోష్‌తో కలిసి ప్రియాంకను అత్తారింటికి పంపించారు. వారిని చూసిన సచిన్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సంతోష్ కుటుంబసభ్యులకు తెలిపాడు. వారు సచిన్ ఇంటికి వెళ్లి చూడగా తలుపు గడియ పెట్టి ఉంది. ఎంతకీ తీయకపోవడంతో కిటికీ లోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read

Iron Rich Diet: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా..? ఆలస్యం చేయకుండా వీటి గురించి తెలుసుకోండి..

త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదు.. బట్‌.. షరతులు వర్తిస్తాయి !! వీడియో

వేప, రావి చెట్లకు అంగరంగ వైభవంగా వివాహం.. ఆపై విందు భోజనం.. ఎక్కడంటే..