ఒంటరి మహిళపై కిరోసిన్ దాడి
మహిళలపై జరుగుతున్న దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఆడవారిపై యాసిడ్, కిరోసిన్, పెట్రోల్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ మహిళలు మాత్రం సమిదలవుతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అనూష అనే మహిళపై ఓ దుండగుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాలు పరిశీలించగా…ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్న అనూష అనే మహిళపై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనూష గట్టిగా కేకలు […]
మహిళలపై జరుగుతున్న దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఆడవారిపై యాసిడ్, కిరోసిన్, పెట్రోల్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ మహిళలు మాత్రం సమిదలవుతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అనూష అనే మహిళపై ఓ దుండగుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాలు పరిశీలించగా…ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్న అనూష అనే మహిళపై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనూష గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.