Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. అక్కడ మూడు రోజులు వైన్ షాపులు బంద్..

|

Oct 29, 2022 | 1:48 PM

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే గెలుపు కోసం అన్ని పార్టీలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. విజయం సాధించేందుకు ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు...

Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. అక్కడ మూడు రోజులు వైన్ షాపులు బంద్..
Wine Shops
Follow us on

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే గెలుపు కోసం అన్ని పార్టీలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. విజయం సాధించేందుకు ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ నేపథ్యంలో నవంబర్‌ 1న సాయంత్రం 6 గంటల నుంచి 3 న సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ వెల్లడించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్‌షాపులు మూసి వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని ఆయన చెప్పారు.

నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్‌లను సీజ్‌ చేసి.. 48 మందిని అరెస్టు చేశారు. 118 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.5.6 లక్షలు ఉంటుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..