Revanth Reddy: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని పిల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

| Edited By: Balaraju Goud

Jun 11, 2024 | 4:54 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయ‌బోతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహ్వానం అంద‌లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం..!

Revanth Reddy: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని పిల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?
Revanth Reddy ,chandrababu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయ‌బోతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహ్వానం అంద‌లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం..! మొద‌టి నుండి చంద్రబాబుకు అత్యంత స‌న్నిహితుడుగా ఉన్నా రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. అనంత‌రం రాజ‌కీయ అనివార్యత‌తో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి.

2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి సీఎం కాగానే చంద్రబాబు పోన్ చేసి అభినందించారు. అనంత‌రం జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఘ‌న విజ‌యం సాదించారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మద్య ఆరోగ్యక‌ర వాతావ‌రణం ఉండాల‌ని, విభ‌జ‌న చ‌ట్టాలను స్నేహ‌పూర్వక వాత‌వ‌ర‌ణం అమ‌లు చేసుకోవాల‌ని ఇరువురు అబిప్రాయాప‌డ్డారు. ఈ పరిణామాలతో తాజాగా ఏపీలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని అందరు అనుకున్నారు. కానీ రేపు జ‌ర‌గ‌బోయే కార్యక్రమానికి ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి అహ్వానం అంద‌లేదని తెలుస్తోంది. దీంతో రేపు జ‌రిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హ‌జ‌రు కావ‌డం లేదని సమాచారం.

కూట‌మి పొత్తుల వ‌ల్లే అహ్వానం పంపలేదా..?

సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల‌కు ప‌క్క రాష్ట్రాల సీఎంలను పిల‌వ‌డం అనావాయితీ. గ‌తంలో ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ ప్రమాణ స్వీకారం చేసిన‌ప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసిఆర్ హ‌జ‌ర‌య్యారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉండ‌టం, తెలంగాణలో ఇండియా కూటిమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ అధికారంలో ఉండ‌టంతో, ఇన్విటేష‌న్ ఇవ్వలేద‌ని తెలుస్తోంది. ఇక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్ర‌మానికి వ‌స్తుండ‌టంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇండియా కూట‌మి నేతలు వేదికను పంచుకోవ‌డం ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ఏపీ సర్కార్ ఆహ్వానం పంప‌క‌పోవ‌డానికి కార‌ణమై ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…