AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. భర్తను లేపేసేందుకు ప్రియుడితో భార్య స్కెచ్.. చనిపోయాడనుకుని..

వివాహేతర సంబంధం వ్యవహారం బయటికిపొక్కడంతో కట్టుకున్న భర్తకు చంపేందుకు ఖతర్నాక్ స్కెచ్ వేసింది ఓ కిలాడీ లేడీ.. ప్రియుడితో కలిసి భర్తను కడతతెర్చడానికి ప్లాన్ చేసింది.. అంతా అనుకున్నట్లే జరిగింది.. ఆ ప్రియుడు అతని స్నేహితులు కలిసి పక్కా ప్లాన్ తో భర్తని తీసుకెళ్లి అతికిరాతకంగా చిత్రహింసలు పెట్టారు..

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. భర్తను లేపేసేందుకు ప్రియుడితో భార్య స్కెచ్.. చనిపోయాడనుకుని..
Crime News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 19, 2025 | 8:58 AM

Share

వివాహేతర సంబంధం వ్యవహారం బయటికిపొక్కడంతో కట్టుకున్న భర్తకు చంపేందుకు ఖతర్నాక్ స్కెచ్ వేసింది ఓ కిలాడీ లేడీ.. ప్రియుడితో కలిసి భర్తను కడతతెర్చడానికి ప్లాన్ చేసింది.. అంతా అనుకున్నట్లే జరిగింది.. ఆ ప్రియుడు అతని స్నేహితులు కలిసి పక్కా ప్లాన్ తో భర్తని తీసుకెళ్లి అతికిరాతకంగా చిత్రహింసలు పెట్టారు.. కానీ, చనిపోయాడనుకున్న ఆ భర్త బతకడంతో అసలు కథ బయటపడింది.. ప్రియుడితో సహా ఆ కిలాడీ లేడి కటకటాల పాలయింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో జరిగింది.

వరంగల్‌లోని మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనేవ్యక్తి పై 14వ తేదీ రాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని పోతననగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి దాడి చేశారు.. అతను చనిపోయాడనుకొని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని హాస్పిటల్‌కి తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది.

ఈ సంఘటన వరంగల్ రామన్నపేట ప్రాంతంలోని రఘునాథ్ కాలనీలో జరిగింది.. గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడేనికి చెందిన పోతుల సందీప్ తో మూడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది.. ఈ క్రమంలో ప్రియుడు సందీప్ కు తన భర్త రాజుతో స్నేహం చేసి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది.

పద్మ భర్త రాజు ప్రయివేట్ చిట్టీలు వేసేవాడు. సందీప్‌తో తన భర్త వద్ద చిట్టీలు వేయించిన పద్మ నిత్యం సందీప్ తన ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసింది. రాజు ఇంట్లోలేని సమయంలో కూడా సందీప్ తరచుగా వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. ఇరుగు పొరుగు వారి ద్వారా రాజు చెవిన పడింది.

రాజుకు ఈ విషయం తెలియడంతో.. అతను భార్య పద్మను మందలించాడు.. ఈ క్రమంలో హైరానా పడిపోయిన భార్య పద్మ.. ప్రియుడు సందీప్‌తో కలిసిభర్త హత్యకు స్కెచ్ వేసింది. తన ప్రియుడికి కొంతడబ్బు సుపారి ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్‌తో కలిసి పోతననగర్ డంపింగ్ యార్డు వద్ద రాజుపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణా రహితంగా కొట్టి గొంతునులిమి హత్యాయత్నం చేశారు.

దాడి అనంతరం.. అతడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకోని అక్కడ నుండి వెళ్లిపోయారు.. రాజు చాలా సేపు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.. ఈ క్రమంలోనే.. డంపింగ్ యార్డు వద్ద రాజును గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ.. రాజుపై చంపారనుకుని.. వెంటనే సందీప్ కు రూ.3 లక్షలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే.. రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదేరాత్రి ఇంటిలో ఉన్న మరో 6 లక్షల రూపాయలు తీసుకుని సందీప్ తో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు . ఈ ఘటనపై రాజు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గరు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు.. అరెస్టయిన వారి వద్ద 5.లక్షల 40 వేల రూపాయల నగదు.. ఓ కారు, రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్క క్లిక్ చేయండి..