Crime news: తాకట్టు పెట్టిన నగలు విడిపించమంటే.. స్క్రూడ్రైవర్ తో పొడిచి హత్య చేశాడు.. ఆపై

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాకముందు చేసిన అప్పులు తీర్చేందుకు భార్య నగలు తాకట్టుపెట్టాడు. వాటిని విడిపించాలని భార్య కోరడంతో ఆమెతో ఘర్షణకు దిగాడు. ఆవేశంలో స్క్రూడ్రైవర్ తో పొడిచి దారుణంగా హత్య(Murder)....

Crime news: తాకట్టు పెట్టిన నగలు విడిపించమంటే.. స్క్రూడ్రైవర్ తో పొడిచి హత్య చేశాడు.. ఆపై
Gold Murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 13, 2022 | 11:08 AM

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాకముందు చేసిన అప్పులు తీర్చేందుకు భార్య నగలు తాకట్టుపెట్టాడు. వాటిని విడిపించాలని భార్య కోరడంతో ఆమెతో ఘర్షణకు దిగాడు. ఆవేశంలో స్క్రూడ్రైవర్ తో పొడిచి దారుణంగా హత్య(Murder) చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ లోని సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన రాజేష్‌ కు ఎలిగేడుకు చెందిన రక్షితను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. రాజేష్ గతంలో భూపాలపల్లిలో(Bhupalapallli) పనిచేశాడు. ఆ సమయంలో ఇతరుల నుంచి డబ్బులు తీసుకోవడంతో రాజేష్‌కు అప్పులు ఎక్కువయ్యాయి. ఇటీవల గోదావరిఖని(Godavarikhani) అడ్డగుంటపల్లిలో కులవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రాజేష్‌కు అప్పులు మరింత పెరిగిపోయాయి. డబ్బు ఇచ్చిన వారు అప్పులు తీర్చాలని ఒత్తిడి చేయడంతో తన భార్య రక్షిత వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాడు. అనంతరం పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో తాకట్టు పెట్టిన బంగారం విడిపించాలని రక్షిత కోరింది.

ఈ విషయమై రక్షిత, రాజేష్ ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఘర్షణలో ఇంట్లో ఉన్న స్క్రూ డ్రైవర్‌తో రక్షితను గొంతులో పొడిచాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించగా హత్య జరిగిన విషయం బయటకు వచ్చింది. పరారీలో ఉన్న రాజేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Also Read

Viral Video: సింహాన్ని ముప్పుతిప్పలు పెట్టిన తాబేలు.. గుక్కెడు నీళ్లు తాగనిస్తే ఒట్టు..!

PAN Misused: మీ పాన్ దుర్వినియోగం అయ్యిందా..? ఇలా చెక్‌ చేసి ఫిర్యాదు చేయండి..?

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. శుభకార్యాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలివే