PAN Misused: మీ పాన్ దుర్వినియోగం అయ్యిందా..? ఇలా చెక్‌ చేసి ఫిర్యాదు చేయండి..?

PAN Misused: పాన్ కార్డ్’ అనేది బ్యాంకింగ్, ఆర్థిక సంబంధమైన వ్యవహారులు నిర్వహించేందుకు అతి కీలకమైన డాక్యుమెంట్లలో ఇదొకటి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు..

PAN Misused: మీ పాన్ దుర్వినియోగం అయ్యిందా..? ఇలా చెక్‌ చేసి ఫిర్యాదు చేయండి..?
Follow us

|

Updated on: Apr 13, 2022 | 9:53 AM

PAN Misused: పాన్ కార్డ్’ అనేది బ్యాంకింగ్, ఆర్థిక సంబంధమైన వ్యవహారులు నిర్వహించేందుకు అతి కీలకమైన డాక్యుమెంట్లలో ఇదొకటి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఈపీఎఫ్ డబ్బు డిపాజిట్ చేసినా పాన్ తప్పనిసరి. పాన్ (PAN) లేకుండా ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలనూ నిర్వహించేందుకు వీలు కాదు. అయితే వినియోగదారులు తప్పనిసరిగా చాలా చోట్ల పాన్ కార్డ్ (PAN Card) వివరాలను అందించాల్సి ఉంటుంది. అయితే పాన్ వివరాలు ఎక్కడెక్కడ ఇచ్చారో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్‌ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందా? దాని సాయంతో ఏదైనా మోసం జరుగుతోందా? అని తెలుసుకోవడం చాలా కీలకం. కొన్ని పద్దతుల ద్వారా పాన్‌ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. అంతే కాదు దానిపి ఫిర్యాదు కూడా చేయవచ్చు.

CIBIL స్కోర్‌ని చేక్‌ చేయడం ద్వారా మీ పాన్‌ కార్డుపై ఎవరైనా లోన్‌ తీసుకున్నారా, ఎక్కడైనా ఉపయోగించారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల CIBIL, Equifax, Experian, CRIF హై మార్క్ ద్వారా చెక్ చేయవచ్చు. CIBIL స్కోర్‌ని చెక్ చేయడం ద్వారా.. మీ పేరు మీద మీకు ఏదైనా లోన్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు.

సిబిల్‌ స్కోర్‌ను తనిఖీ చేయడం ఎలా..?

మీరు ఈ పనిని స్మార్ట్‌ఫోన్‌లో కూడా చేయవచ్చు. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో కూడా ఈ పని సులభం కొన్ని నిమిషాల్లో చేసుకునే వెసులుబాటు ఉంది. పాన్‌ దుర్వినియోగాన్ని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం.

1. ముందుగా CIBIL పోర్టల్‌కి వెళ్లండి https://www.cibil.com/ 2. పోర్టల్ కుడి వైపున ‘గెట్ యువర్ CIBIL స్కోర్’ అని కనిపిస్తుంది. 3. ఇక్కడ మీరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకోవాలి 4. పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి 5. లాగిన్ కోసం పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేయండి. 6. IT రకంలో కనిపించే ఆదాయపు పన్ను IDని ఎంచుకోండి. ఆ తర్వాత పాన్‌ను నమోదు చేయండి 7. ఇప్పుడు ‘వెరిఫై యువర్ ఐడెంటిటీ’పై క్లిక్ చేసి, అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి 8. ‘చెల్లింపులు చేయండి’ ట్యాబ్‌కు వెళ్లి, ప్రక్రియను పూర్తి చేయండి 9. వన్ టైమ్ చెకప్ ఉంటే సబ్‌స్క్రిప్షన్‌ను దాటవేసి మీ ఖాతాలో కొనసాగండి 10. ఇమెయిల్ లేదా OTPని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ చేయండి 11. మీ వివరాలను పూరించడానికి ఒక ఫారమ్ కనిపిస్తుంది 12. ఇప్పుడు CIBIL స్కోర్‌ని తెలుసుకోవడానికి ఫారమ్‌ను పూరించండి. ఆ తర్వాత మీ డ్యాష్‌బోర్డ్‌లో స్కోర్ కనిపిస్తుంది.

దుర్వినియోగాన్ని ఎలా నివేదించాలి:

పాన్‌కు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్ పోర్టల్‌ను రూపొందించింది. ఇందుకోసం ఆదాయపు పన్ను సంప్రదింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. UTITSLకి నేరుగా లింక్ చేయబడిన ఈ పోర్టల్ ద్వారా PAN ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. మీరు ఈ పోర్టల్ సహాయంతో మీ డూప్లికేట్ పాన్‌ని కూడా సరెండర్ చేయవచ్చు. పాన్‌పై ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి.

1. https://incometax.intalenetglobal.com/pan/pan.aspకి వెళ్లండి 2. సమర్పించు బటన్‌పై క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి. ఫిర్యాదు రకం, రసీదు సంఖ్య మొదలైనవాటిని నమోదు చేయండి. 3. చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ ఫిర్యాదు నమోదు చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి:

Forex Markup Fee: వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 క్రెడిట్ కార్డ్‌లతో ఎన్నో ప్రయోజనాలు

Property: ఆస్తిని విరాళంగా, బహుమతిగా ఎలా ఇవ్వాలి..? ఇతరుల పేర్లతో ఉన్న ఆస్తిని దానం చేయవచ్చా..? నియమాలు ఏమిటి