Forex Markup Fee: వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 క్రెడిట్ కార్డ్‌లతో ఎన్నో ప్రయోజనాలు

Forex Markup Fee: మీరు వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే తక్కువ ఫారెక్స్ ఫీజుతో మంచి సేవలను అందించే కొన్ని క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. విదేశాల్లో క్రెడిట్ కార్డ్ (Credit Card)..

Forex Markup Fee: వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 క్రెడిట్ కార్డ్‌లతో ఎన్నో ప్రయోజనాలు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 13, 2022 | 8:41 AM

Forex Markup Fee: మీరు వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే తక్కువ ఫారెక్స్ ఫీజుతో మంచి సేవలను అందించే కొన్ని క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. విదేశాల్లో క్రెడిట్ కార్డ్ (Credit Card)చెల్లింపులు చేయడానికి బ్యాంకులు (Banks) విదేశీ మారకపు మార్కప్ రుసుమును వసూలు చేస్తాయి. ఈ రుసుము మీ లావాదేవీ మొత్తంలో 3.5% వరకు ఉండవచ్చు. అయితే తక్కువ మార్కప్ ఫీజులను వసూలు చేసే కొన్ని క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. విదేశీ పర్యటనల్లో ఈ కార్డులను ఉపయోగించడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి ఇటువంటి కార్డులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. PaisaBazaar తక్కువ ఫారెక్స్ మార్కప్ ఫీజులను వసూలు చేసే ఐదు కార్డ్‌లను జాబితా చేసింది.

విదేశీ కరెన్సీ మార్కప్ ఫీజు అంటే ఏమిటి..?

మీరు స్వదేశం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఆ దేశ కరెన్సీ రూపంలో ఇక్కడి క్రెడిట్‌ కార్డును ఉపయోగించినప్పుడు అందుకు కొంత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అలా కార్డు వినియోగించినప్పుడు వసూలు చేసే ఫీజే విదేశీ కరెన్సీ మార్కప్‌ ఫీజు అంటారు.

HDFC రెగాలియా క్రెడిట్ కార్డ్ ఇటువంటి ఆఫర్‌ను అందిస్తుంది. ఈ కార్డ్ ప్రతి రూ.150 రిటైల్ కొనుగోలుపై 4 రివార్డ్ పాయింట్‌లను ఇస్తుంది. బీమా, యుటిలిటీ, విద్య, అద్దె చెల్లింపులపై కూడా రివార్డ్‌లు అందుకోవచ్చు. ఈ కార్డ్ విదేశీ కరెన్సీ మార్కప్ రుసుము 2%గా నిర్ణయించబడింది. కార్డ్ కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌తో కూడా వస్తుంది. భారతదేశంలో 12 ఉచిత యాక్సెస్, విదేశాల్లో 6 ఉన్నాయి. ఈ కార్డుకు వార్షిక రుసుము రూ. 2500.

SBI కార్డు. ఇందులో ఎలైట్ ఆఫర్‌లు అందించబడతాయి. ఇందులో మీరు డైనింగ్, డిపార్ట్‌మెంటల్ స్టోర్, గ్రోసరీపై ఖర్చు చేస్తే 5 రివార్డ్ పాయింట్‌లు పొందుతారు. మిగిలిన ఖర్చులపై ప్రతి 100 రూపాయల కొనుగోలుకు 2 పాయింట్లు పొందవచ్చు. ఇందులో ఇంధనం కొనుగోలు ఉండదు. ఈ కార్డ్‌తో ట్రైడెంట్ ప్రివిలేజ్ మెంబర్‌షిప్, క్లబ్ విస్తారా మెంబర్‌షిప్ ఇవ్వబడుతుంది. ఈ కార్డ్ విదేశీ కరెన్సీ మార్కప్ ఫీజు 1.99 శాతం. విదేశాలలో 6 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, దేశంలో 2 కాంప్లిమెంటరీ లాంజ్‌లకు యాక్సెస్ ఉచితం. కార్డు వార్షిక రుసుము రూ. 4,999.

IndusInd Legend క్రెడిట్ కార్డ్ వారం రోజులలో ఖర్చు చేసే ప్రతి రూ. 100కి 1 రివార్డ్ పాయింట్‌, వారాంతాల్లో ఖర్చు చేసే ప్రతి రూ. 100కి 2 రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు. కార్డ్ హోల్డర్‌లకు దేశంలోని ఒబెరాయ్ హోటల్‌లు, చార్లెస్ అండ్‌ కీత్, లూయిస్ ఫిలిప్, హుష్ పప్పీస్, అర్బన్ లాడర్, మోంట్‌బ్లాంక్ మొదలైన వాటిలో కాంప్లిమెంటరీ బస, ప్రయాణం కోసం డిస్కౌంట్ వోచర్‌లు అందించబడతాయి. దీని విదేశీ కరెన్సీ మార్కప్ ఫీజు 1.8%. దీని ఒక్కసారి చేరే రుసుము రూ. 9,999. ఈ కార్డుపై వార్షిక రుసుము లేదు.

HDFC డైనర్స్ క్లబ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ ప్రతి కొనుగోలుపై 5 రివార్డ్ పాయింట్‌లను, వారాంతపు డైనింగ్‌పై 2 పాయింట్లను అందిస్తుంది. కార్డ్ హోల్డర్‌కు క్లబ్ మారియట్, ఫోర్బ్స్, అమెజాన్ ప్రైమ్, జొమాటో ప్రో, టైమ్స్ ప్రైమ్‌ల వార్షిక సభ్యత్వం ఇవ్వబడుతుంది. దీని విదేశీ కరెన్సీ మార్కప్ ఫీజు 2%. ఈ కార్డ్‌లో ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ అందించబడుతుంది. కార్డు వార్షిక రుసుము రూ. 10,000.

యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ కార్డ్ భారతదేశంలో ఖర్చు చేసే ప్రతి రూ. 200కి 15 ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను, ఇతర దేశాల్లో ఖర్చు చేసే ప్రతి రూ. 200కి 30 ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. కార్డ్ హోల్డర్‌లు ప్రతి సంవత్సరం నాలుగు కాంప్లిమెంటరీ లగ్జరీ ఎయిర్‌పోర్ట్ పికప్/డ్రాప్‌లు, విమానాశ్రయంలో ఎనిమిది కాంప్లిమెంటరీ VIP సపోర్ట్ సర్వీస్‌లు, కార్డ్ యాక్టివేషన్, రెన్యూవల్‌పై 50,000 రివార్డ్ పాయింట్లు, ఇతర ఖర్చుపై ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 50,000.

ఇవి కూడా చదవండి:

Property: ఆస్తిని విరాళంగా, బహుమతిగా ఎలా ఇవ్వాలి..? ఇతరుల పేర్లతో ఉన్న ఆస్తిని దానం చేయవచ్చా..? నియమాలు ఏమిటి

MG Motor India: ఎంజీ మోటార్స్‌ ఇండియా కీలక నిర్ణయం.. చిన్న ఎలక్ట్రిక్‌ వాహనాలు..!