AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. శుభకార్యాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలివే

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) శుభవార్త చెప్పింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చౌకగా రవాణా సదుపాయం కల్పించేందుకు సమాయత్తమైంది. వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్రత్యేక బస్సులు(Special Busses) ఏర్పాటు...

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. శుభకార్యాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలివే
Tsrtc
Ganesh Mudavath
|

Updated on: Apr 13, 2022 | 9:37 AM

Share

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) శుభవార్త చెప్పింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చౌకగా రవాణా సదుపాయం కల్పించేందుకు సమాయత్తమైంది. వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్రత్యేక బస్సులు(Special Busses) ఏర్పాటు చేసింది. “ఇది పెళ్లిళ్ల కాలం.. ఎలా వెళ్లాలా అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆర్టీసీ బస్సులో మీ శుభకార్యాలకు హాజరుకండి..!” అంటూ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌(Hyderabad RTC Zone) ఆఫర్ ప్రకటించింది. అంతే కాదు ముందుగా బుక్‌ చేసుకుంటే 15 శాతం రాయితీ ప్రకటించింది. 31 రోజుల కంటే ముందు బుక్‌ చేసుకుంటే ఏకంగా 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్‌, మే నెలల్లో పెళ్లిళ్లు ఎక్కువ ఉన్నందున ఈ వెసులుబాటు కల్పించినట్టు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల ఇంధన ధరలు పెరిగడంతో ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. కొత్తగా విధించిన పన్నులతో ఆర్టీసీ బస్సులకు అద్దెలు 30 శాతం పెంచారు. పల్లె వెలుగు లేదా ఆర్డినరీ బస్సులపై గతంలో కిలోమీటరుకు రూ.83 ఉంటే ప్రస్తుతం ఆ ఛార్జీలను రూ.108కు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు రూ.137, డీలక్స్‌ రూ.148, సూపర్‌ లగ్జరీ రూ.166, రాజధాని లేదా వజ్ర రూ.196, గరుడ ప్లస్‌ రూ.232 కు పెరిగాయి.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో తీసుకువచ్చేందుకు సంస్థ అధికారులు శాయాశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిళ్లకు బస్సుల అద్దెపై ఆర్టీసీ గతంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. వివాహాలకు బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. పెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ను రద్దు చేసింది. గతంలో మొత్తం ఛార్జీలో 20శాతం అ డ్వాన్స్‌ చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ డిపాజిట్‌ను రద్దు చేయడంతో ప్రజలు ప్రైవేట్‌ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు.

Also Read

Eggs Side Effect: గుడ్డు మంచిదని తెగ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..

Beast Twitter Review: విజయ్ బీస్ట్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?

అరాచకంగా ఆచార్య ట్రైలర్.. బట్టల చింపుకుంటున్న మెగా ఫ్యాన్స్