Telangana Politics: ఎన్నికల ముందు హస్తం పార్టీకి ఊపు.. బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతలు వీరే..
సుదీర్ఘ సందిగ్ధానికి తెరదించుతూ...కాంగ్రెస్ పెద్దల ముందు పెద్ద చిట్టానే పెట్టినట్టు అర్ధమవుతోంది. ఇతర పార్టీల నేతలకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చే ఛాన్స్ ఉందో ఓ సారి పరిశీలిద్దాం..

తెలంగాణ కాంగ్రెస్ కొత్త నెత్తురు నింపుకుంటోందా.. తెలంగాణలో అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు జవసత్వాలు కూడగట్టుకుంటోందా.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనావాసరెడ్డి చేరిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టోరీ మారిపోయిందా..అలానే అనిపిస్తోంది. తన ప్రత్యర్ధులను షాక్ ఇస్తూ ముందుకు దోసుకుపోయేందుకు కాలు దువ్వుతోంది. గత కొంతకాలంగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ చేరికల గుస గుసలు నిజమయ్యాయి. సుదీర్ఘ సందిగ్ధానికి తెరదించుతూ…కాంగ్రెస్ పెద్దల ముందు పెద్ద చిట్టానే పెట్టినట్టు అర్ధమవుతోంది. ఇతర పార్టీల నేతలకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చే ఛాన్స్ ఉందో ఓ సారి పరిశీలిద్దాం..
ముందుగా టీఆర్‌ఎస్ బలమైన ప్రత్యర్ధి బీజేపీనే కానుందని.. పొలిటికల్ గ్రాఫ్ పెరిగిందని తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉత్తరాన్ని ఊపేస్తున్న కమలం పార్టీ దక్షిణంలోనూ దంచికొట్టేందుకు దూసుకువస్తోందని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆ పార్టీలోకి జంపింగ్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఆ తర్వాత అతర్గత విభేదాలు పెరిగి.. తెలంగాణలో పార్టీ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ జాతీయ నాయకత్వం. అయితే, కమలం పార్టీ నుంచి హస్తం పార్టీలోకి ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది చేరుతున్నారంటూ గత నెలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. బీజేపీలో చేరతారని అనుకున్న పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు జూపల్లి కృష్ణారావు.
ఇక టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి. ఆ తర్వాత ఈటల రాజేందర్‌తో కలిసి పార్టీని వీడారు. ఈటలతో తుల ఉమ, తదితర ముఖ్య నేతలు కూడా కమలం పార్టీలో చేరారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలు జోరుందుకున్నాయి.కమలం పార్టీలో కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన.. తాజాగా చోటుచేసుకున్న మార్పులు.. నేపథ్యంలో హస్తం పార్టీ నేతలు వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీలోని తాజా పరిణామాల నేపథ్యంలో అందులో ఇమడలేక ఈ ఇద్దరు కాంగ్రెస్‌లో వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఏనుగు రవీందర్‌రెడ్డి ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఆ జిల్లాకే చెందిన జూపల్లి కృష్ణారావుతో డిస్కషన్ చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరడమే వీరి మధ్య జరిగిన చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం.
మరోవైపు బీఆర్ఎస్ చెందిన పలువురు అసంతృప్త నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనల్లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. నేతలు కారు దిగుతున్న నేతల జాబితాలో తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేరు కూడా చేరినట్లుగా సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
