Telangana CS: తెలంగాణ నెక్ట్స్ సీఎస్ ఆయనేనా? రేసులో నలుగురు ఐఏఎస్‌లు.. సీఎం కేసీఆర్ చూపు ఎవరివైపు..

Telangana: తెలంగాణ కొత్త సీఎస్‌ ఎవరు? ఇప్పుడు ఇదే ఉత్కంఠగా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.డీవోపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్‌ కుమార్‌ను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ..

Telangana CS: తెలంగాణ నెక్ట్స్ సీఎస్ ఆయనేనా? రేసులో నలుగురు ఐఏఎస్‌లు.. సీఎం కేసీఆర్ చూపు ఎవరివైపు..
Cm Kcr

Updated on: Jan 11, 2023 | 9:35 AM

తెలంగాణ కొత్త సీఎస్‌ ఎవరు? ఇప్పుడు ఇదే ఉత్కంఠగా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.డీవోపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్‌ కుమార్‌ను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కొత్త సీఎస్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌దే ఫైనల్ డెసిషన్‌.

రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుమిదిని, శాంతి కుమారి, శశాంక్‌ గోయల్‌, సునీల్‌ శర్మ, రజత్‌ కుమార్‌, రామకృష్ణారావు, అర్వింద్‌ కుమార్‌ ఉన్నారు. వీరిలో వసుధా మిశ్రా, శశాంక్‌ గోయల్‌, అశోక్‌ కుమార్‌ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాణి కుమిదిని కార్మికశాఖ, శాంతి కుమారి అటవీశాఖ బాధ్యతల్లో ఉన్నారు. సునీల్‌ శర్మ ఇంధనశాఖ, రజత్‌ కుమార్‌ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు ఆర్థికశాఖ, అర్వింద్‌ కుమార్‌ పురపాలకశాఖ బాధ్యతల్లో ఉన్నారు.

రాణి కుమిదిని పదవీకాలం జూన్‌ నెలతో ముగియనుంది. శాంతికుమారి 2025 ఏప్రిల్‌ వరకు ఉంటారు. సునీల్‌ శర్మ 2024 మే వరకు, రజత్‌ కుమార్‌ ఈ ఏడాది నవంబర్‌ వరకు పదవిలో ఉంటారు. రామకృష్ణారావు 2025 ఆగస్టు వరకు, అర్వింద్‌ కుమార్‌ 2026 ఫిబ్రవరి వరకు పదవిలో ఉంటారు. రామకృష్ణారావు, అర్వింద్‌ కుమార్‌ పేర్లు సీఎస్‌ రేసులో బలంగా ఉన్నాయి. రజత్‌కుమార్‌, సునీల్ శర్మ, శాంతికుమారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీరందరిలోనూ రామకృష్ణారావు ఒక్కరే తెలంగాణ స్థానికత కలిగిన అధికారి.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి కొత్త సీఎస్‌ను నియమించనున్నారు. కొత్త సీఎస్‌ నియామకంతో పాటు సోమేశ్‌ కుమార్‌ ప్రస్తుతం చూస్తున్న రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, సీసీఎల్‌ఏ, గనులశాఖ బాధ్యతలను కూడా ఇతర అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..