AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు.. ఇకపై 12 గంటలు కాదు.. ఎంత టైంలో వెళ్తుందంటే?

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు.. ఇకపై 12 గంటలు కాదు.. ఎంత టైంలో వెళ్తుందంటే?
కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే ఈ స్టేషన్‌లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ సెమీ హైస్పీడ్ రైలు సేవలందించనుంది.
Ravi Kiran
|

Updated on: Jan 11, 2023 | 9:32 AM

Share

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఇక ఇదే తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ ట్రైన్. ఈ రైలు గంటకు 180కి.మీ వేగంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8.40 గంటల్లో కవర్ చేస్తుందని రైల్వేశాఖ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. దీని బట్టి చూస్తే ఇప్పటిదాకా పై రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా పరుగులు పెట్టే దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటుంది.

అలాగే ఇతర రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్‌ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.

మరోవైపు ఈ ట్రైన్ వారంలో అన్ని రోజులు నడవనుంది. ప్రతీ రోజూ ఉదయం విశాఖ నుంచి.. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. 20 నిమిషాల బ్రేక్‌తో తిరిగి విశాఖకు బయల్దేరి.. రాత్రికి చేరుకుంటుంది. ఇంటర్మీడియట్ స్టేషన్లు అయిన విజయవాడలో 5 నిమిషాలు.. వరంగల్, ఖమ్మం, రాజమండ్రి స్టేషన్లలో రెండేసి నిమిషాల చొప్పున అగనుంది. ఇక వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రాధమికంగా నిర్ణయించిన టైమింగ్స్ ఇలా ఉన్నాయి.

విశాఖపట్నంలో ఈ ట్రైన్ ఉదయం 5.45 గంటలకు బయల్దేరి.. సికింద్రాబాద్ మధ్యాహ్నం 2.25 గంటలకు చేరుతుంది. అలాగే సికింద్రాబాద్‌లో 2.45 గంటలకు బయల్దేరి.. విశాఖపట్నంకు తిరిగి రాత్రి 11.25 గంటలకు చేరుకుంటుంది. ఇక ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉండే ఈ రైలులో ఏసీ చైర్ కార్ ధర రూ. 1800, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3300 వరకు ఉండొచ్చునని అంచనా. కాగా, ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్, టికెట్ ధరలు, ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందన్న విషయంపై ఇంకా రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Follow Us
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
పండ్లలో రాజు మామిడి.. మరి రాణి ఎవరో తెలుసా..?
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
హెచ్-1బీ ఫీజు పెంపు రద్దు..! కోర్టు సంచలన తీర్పు!
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందా?
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు
అదృష్టం వరించింది.. జూన్ 17 నుంచి వీరి ఇంట ధన వర్షం..డబ్బే డబ్బు