Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.! మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
తమిళనాడు తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడింది. ఈరోజు వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తమిళనాడు తీరం నుంచి వాయవ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. వాయువ్య దిశగా రాబోయే కొద్ది గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏపీలోని 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ ఇవ్వగా.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ ఇచ్చింది. అటు ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆయా జిల్లాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో ఎడతెరపిలేని వర్షాలతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాల దగ్గర భారీగా వరద వస్తుండటంతో.. ఎవ్వరిటీ అటువైపు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.
మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచనలు ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలకు మోస్తారు వర్షాలు కురుస్తాయంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఈరోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈరోజు 23 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
రేపు తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఈరోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తాయంది.
