Weather Alert: హాట్ సమ్మర్‌లో కూల్‌ న్యూస్‌.. ఈ జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలే.. వర్షాలు..

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం, బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Weather Alert: హాట్ సమ్మర్‌లో కూల్‌ న్యూస్‌.. ఈ జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలే.. వర్షాలు..
Telangana Rain Alert

Updated on: May 30, 2023 | 7:41 AM

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం, బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన పడేఅవకాశం ఉందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వర్షాలు కురుస్తున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వరంగల్‌, ఆదిలాబాద్‌లో భారీ వర్షం

వరంగల్‌, ఆదిలాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన భారీ వర్షం పడటంతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. వర్షంతో కొనగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ధాన్యం కుప్పలు, ఆరబోసిన వడ్ల పక్కన వర్షపు నీరు నిలిచింది. వర్షం నుంచి రక్షణకు రైతులు వడ్లపై పరదాలు కప్పడానికి ప్రయత్నించగా గాలిదుమారంతో అవి ఎగిరిపోయాయి. ధాన్యం తడిసి భారీగా నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..