Rain in TS: హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వానలే వానలు.. అధికారులు అలర్ట్‌

|

Aug 20, 2024 | 6:40 AM

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు తెల్లవారు జామునుంచే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కురుస్తోంది. మల్కాజ్ గిరి, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ విభాగం భారీ వర్షం పడుతుందన్న హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అలర్ట్‌ అయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది.

Rain in TS: హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వానలే వానలు.. అధికారులు అలర్ట్‌
Hyderabad Rains
Follow us on

తెలంగాణలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తు వరకు విస్తరించిన ఆవర్తనంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగాల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రాగల మూడు గంటల్లో హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణ పేట, సిద్దిపేట, వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేయగా.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు తెల్లవారు జామునుంచే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కురుస్తోంది. మల్కాజ్ గిరి, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ విభాగం భారీ వర్షం పడుతుందన్న హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అలర్ట్‌ అయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది.

మంగళవారం నుంచి హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది..తెల్లవారు జామునే మళ్ళీ భారీ వర్షం కురవడంతో హైదరాబాద్‌ వణికిపోయింది. భారీగా కురిసిన వానతో రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. విద్యుత్ కోతలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు నిజామాబాద్‌లో వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయింది. రోడ్లపై వరదనీరు చెరువును తలపించింది. బీభత్సమైన వర్షానికి రైల్వే కమాన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ట్రాఫిక్ పోలీసులు బస్సులోని ప్రయాణికుల్ని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. అటు భీమ్‌గల్‌లో భారీ వర్షంతో వాగులు ఉప్పొంగాయి. వరదతో పంటపొలాలు నీటమునిగాయి. భీమ్‌గల్‌లో 10.4.. నిజామాబాద్‌ టౌన్‌లో 8.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏకధాటిగా కురిసిన వర్షానికి యాదాద్రి కొండ తడిసిముద్దయింది. వరదనీటితో ఆలయ పరిసరాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో భక్తులు ఇబ్బందిపడ్డారు.

 

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..