నిన్నటి వరకు తప్పుడు కొలతలతో అక్రమాలకు పాల్పడిన పెట్రోల్ బంక్(Petrol Bunk) నిర్వాహకులు.. ఇప్పుడు వాహనదారుల్ని కల్తీ ఇంధనం పోస్తూ నిండా ముంచుతున్నారు. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా డీజిల్(Diesel) లో ఏకంగా నీళ్లు కలిపి చీకటి వ్యాపారం చేస్తున్నారు. పాలు, నూనె, నెయ్యి, సారా.. ఇలా ఒకటేంటి అన్నింటిని కల్తీ(Adulteration) చేస్తున్నారు కల్తీగాళ్లు. కొత్తగా ఇంధనాన్ని కూడా కలుషితం చేసి బహిరంగ మార్కెట్ లో దర్జాగా అమ్ముకుంటున్నారు. రుచి చూడని ద్రవ పదార్థం కావడంతో రంగు మాత్రమే డీజిల్ ని పోలి ఉండేలా కొన్ని రసాయనాలు కలిపి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు అక్రమ వ్యాపారులు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ఆ పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోయించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ బంక్‌ను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ నగర శివారు పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో డీజిల్‌లో నీళ్లు కలిపి పోస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. డీజిల్‌లో నీరు కలిపి పోయడంతో నాలుగు కార్లు, బోర్‌వెల్ వాహనం అక్కడికక్కడే ఆగిపోయాయి. డీజిల్ పోయించిన తర్వాత వాహనాలు ఉన్నట్లుండి మొరాయించాయి. మెకానిక్ వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి చూపిస్తే డీజిల్‌లో నీరు లాంటి ద్రవం కలిసిందని చెప్పడంతో వారు కంగుతిన్నారు. వాహన యజమానులు పెట్రోల్ బంకు వద్దకు వెళ్తే.. తమ వద్ద ఎలాంటి సమస్య లేదని, మీరే వాహనం ట్యాంక్‌లో నీరు కలుపుకొని వచ్చారంటూ బంకుల నిర్వాహకులు బుకాయించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క పెట్రోల్ బంకుపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సివిల్ సప్లై అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకును మూసివేయాలని డిమాండ్ చేశారు.
Also Read
Women Health: మహిళలకి ఆ సమయంలో ఈ 7 ఆహారాలు అత్యవసరం.. ఎందుకంటే..?
Rashmika Mandanna: పాల మీగడ లాంటి పరువాలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్న