Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

సంగారెడ్డిలోని మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం చేస్తున్నాడంటూ అక్కలు ఫిర్యాదు చేసేందుకు సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే ఇది కుటుంబ వ్యవహారం..

Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు
Property Dispute In Sangareddy

Edited By:

Updated on: Mar 25, 2026 | 9:43 AM

మెదక్, మార్చి 25: అందరికీ రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ ముందే.. రక్తసంబంధీకులు వీధి పోరాటానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందే కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం చేస్తున్నాడంటూ అక్కలు ఫిర్యాదు చేసేందుకు సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే ఇది కుటుంబ వ్యవహారం కావడంతో.. బయట కూర్చుని మాట్లాడుకోవాలని, సాధ్యం కాకపోతే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించి పంపారు. సరే అని పోలీసులకు చెప్పి బయటకు వచ్చారు ఇరువురు కుటుంబ సభ్యులు. స్టేషన్ మెట్లు దిగారో లేదో అక్కాతమ్ముళ్ల మధ్య మాటల యుద్ధం కాస్తా.. మహా యుద్ధంగా మారింది.

 

ఇవి కూడా చదవండి

ఆవేశంతో ఊగిపోయిన అక్కలు తమ్ముడిపై దాడికి దిగగా.. తమ్ముడు కూడా ఎదురుదాడికి దిగాడు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ కిందపడి దొర్లారు. స్టేషన్ బయట ఉన్న జనం ఈ దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. గొడవ పెద్దది కావడంతో స్టేషన్ లోపల ఉన్న పోలీసులు పరుగున వచ్చి వారిని వారించే ప్రయత్నం చేశారు. కానీ, ఆవేశంలో ఉన్న కుటుంబ సభ్యులు పోలీసులను సైతం లెక్కచేయలేదు. అడ్డువచ్చిన ఖాకీలను పక్కకు నెట్టేసి మరీ చితకబాదుకున్నారు. పోలీసులే విస్తుపోయేలా సాగిన ఈ రచ్చ.. చివరికి సిబ్బంది అందరూ కలిసి వారిని చెదరగొట్టే వరకు ఆగలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us