మైసమ్మకు మహానివేదన.. ఏకరూప వస్త్రధారణలో వందలాది బోనాలు.. మంత్రి హరీష్‌ రావు ప్రత్యేక పూజలు..

| Edited By: Jyothi Gadda

Jul 24, 2023 | 5:21 PM

పట్టణంలోని వైశ్య భవనం నుంచి లాల్‌కమాన్‌ గడి మైసమ్మ ఆలయం వరకు ఏకరూప వస్త్రధారణ,బోనం, అలంకరణతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు.

మైసమ్మకు మహానివేదన.. ఏకరూప వస్త్రధారణలో వందలాది బోనాలు.. మంత్రి హరీష్‌ రావు ప్రత్యేక పూజలు..
Bonalu
Follow us on

సిద్ధిపేట,జులై 24: బోనాల పండుగ అంటే అన్ని కులాల వారు తీస్తారు.. కానీ సిద్దిపేట పట్టణ కేంద్రంలో తొలిసారిగా ఆర్యవైశ్య మహిళలు బోనాలు తీయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది..సిద్దిపేట పట్టణ కేంద్రంలో IVF విభాగం ఆధ్వర్యంలో వినూత్న బోనాల ఊరేగింపు జరిగింది..స్థానిక వైశ్య భవనం నుండి లాల్ కమాన్ గడి మైసమ్మ వరకు ఏకరూప వస్త్రధారణతో 600 మహిళలతో శోభాయాత్ర అందరిని ఆకర్షించింది.

అంతర్జాతీయ వైశ్య సమాఖ్య (ఐవీఎఫ్‌) మహిళా విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బోనాల ఊరేగింపును ఆదివారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వైశ్య భవనం నుంచి లాల్‌కమాన్‌ గడి మైసమ్మ ఆలయం వరకు ఏకరూప వస్త్రధారణ,బోనం, అలంకరణతో సుమారు 600 మంది మహిళలు శోభాయాత్రలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్‌రావు మైసమ్మ ఆలయంలో పూజలు చేశారు. తొలిసారి సామూహికంగా బోనాల ఉత్సవం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..