Warangal Crime: తాగొచ్చి వేధిస్తున్నాడనీ.. భర్తను హత్యచేసిన భార్య! ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ

మద్యం మత్తు ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగులుస్తోంది. మద్యానికి బానిసై భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడో భర్త.. నిత్యం వేదన అనుభవిస్తోన్న భార్య దుఃఖం దిగమింగుకుని కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటు..

Warangal Crime: తాగొచ్చి వేధిస్తున్నాడనీ.. భర్తను హత్యచేసిన భార్య! ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
Warangal Crime

Updated on: Apr 06, 2023 | 9:59 AM

మద్యం మత్తు ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగులుస్తోంది. మద్యానికి బానిసై భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడో భర్త.. నిత్యం వేదన అనుభవిస్తోన్న భార్య దుఃఖం దిగమింగుకుని కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ముంజాల కుంట తండాలో నివసం ఉంటున్న జాటోతూ శ్రీనుకు శాంతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. మద్యానికి బానిసైన శ్రీను నిత్యం తాగి వచ్చి భార్య శాంతికి నరకం చూపించేవాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం శ్రీను అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మృతుని భార్య శాంతిని విచారించగా అసలు విషయం బయటపడింది. తాగి వచ్చి తనను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భర్తను చంపేందుకు శాంతి పథకం పన్నింది. పథకం ప్రకారం భార్య శాంతి మరో వ్యక్తి సహాయంతో శ్రీనును హత్య చేసింది. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా నిందితులు చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మృతుడి భార్య శాంతిని, ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మామునూరు ఏసీపీ కృపాకర్ మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us