Telangana: మట్టానికి పడిపోయిన మిర్చి ధరలు.. ఎందుకు ఈ పరిస్థితి..?

2022- 2023 వ్యవసాయ సీజన్ లో 11,38,837 క్వింటాల మిర్చి అమ్మకాలు జరిగాయి.. దేశీరకం మిర్చి క్వీoటా 81,000 రూపాయల ధర నమోదయింది.. 2021- 2022 వ్యవసాయ సీజన్ లో దేశంలోనే అత్యధిక ధర నమోదైంది.. దేశీరకం మిర్చి క్వింటా 96,000 రూపాయల రికార్డ్ ధర పలికింది.. కానీ ఈ ఏడాది మాత్రం....

Telangana: మట్టానికి పడిపోయిన మిర్చి ధరలు.. ఎందుకు ఈ పరిస్థితి..?
Dry Mirchi
Follow us
G Peddeesh Kumar

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2024 | 1:35 PM

వరంగల్, జనవరి 31:  గత ఏడాది రైతులకు సిరుల వర్షం కురిపించింది ఎర్ర బంగారం. కానీ ఈ ఏడాది మాత్రం కన్నీరు పెట్టేలా చేస్తుంది. మార్కెట్ లో అమ్మకానికి మిర్చి పోటెత్తుతుంది.. కానీ ధరలు చూసి రైతులు దిగులు చెందుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్‌గా గుర్తింపున్న వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు ఎర్రబంగారం పోటెత్తింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా మిర్చిని అమ్మకానికి తరలిస్తున్నారు.. దీంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కిటకిటలాడుతోంది.

నెల రోజుల వ్యవధిలో 1లక్ష 28 వేల క్వింటాల మిర్చి అమ్మకానికి తీసుకొచ్చారు. మార్కెట్ యార్డులో ఎటు చూసినా ఎర్ర బంగారమే తివాచీ పరిచినట్లు కనిపిస్తుంది.. ప్రస్తుతం రైతులు తీసుకువస్తున్న మిర్చిలో తేజా, వండర్ హార్ట్, 341, దేశీరకం మిర్చి అమ్మకానికి తీసుకు వస్తున్నారు.. ఈ వ్యవసాయ సీజన్ లో తేజారకం ఇప్పటివరకు 20,400 రూపాయలు టాప్ ధరగా నమోదయింది.. వండర్ హార్ట్ – 18, 000రూ, 341రకం – 16,500, దేశీ రకం 32,000 రూ.. అధిక ధరలుగా నమోదయ్యాయి..

గత రెండు సంవత్సరాల నుండి రికార్డులు సృష్టిస్తున్న మిర్చి ధరలు వూహించని విధంగా ఢీలా పడ్డాయి.. కొండంత ఆశతో ఎర్ర బంగారం అమ్మకానికి తరలించిన రైతులు ఈ ధరలుచూసి దిగులు చెందుతున్మారు. 2022- 2023 వ్యవసాయ సీజన్ లో 11,38,837 క్వింటాల మిర్చి అమ్మకాలు జరిగాయి.. దేశీరకం మిర్చి క్వీoటా 81,000 రూపాయల ధర నమోదయింది.. 2021- 2022 వ్యవసాయ సీజన్ లో దేశంలోనే అత్యధిక ధర నమోదైంది.. దేశీరకం మిర్చి క్వింటా 96,000 రూపాయల రికార్డ్ ధర పలికింది..

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది దేశీరకం మిర్చి 32,000 రూపాయల అధిక ధరగా నమోదైంది.. ఒక్కసారిగా తగ్గిన ధరలు చూసి రైతులు నోరెళ్ళ బెడుతున్నారు. కనీస మద్దతు ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎర్ర బంగారం రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తీసుకువస్తున్న మిర్చిలో తేమశాతం ఎక్కువగా ఉండడమే కారణమని వ్యవసాయ మార్కెట్ అధికారులు అంటున్నారు.. దీనికి తోడు విదేశీ మార్కెట్ లో ఆశించిన స్థాయిలో మిర్చి డిమాండ్ లేక పోవడం, ఎగుమతులు తగ్గిపోవడం కూడా మరో కారణం అంటున్నారు.. కారణాలు ఏమైనా రైతులు మాత్రం గుళ్ల అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..