RTC Bus Driver: బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. సమయస్పూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించిన డ్రైవర్

|

Nov 14, 2021 | 9:05 PM

RTC Bus Driver: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ సమయ స్పూర్తితో పదుల సంఖ్యలో ప్రయాణికులు క్షేమంగా ఇంటికెళ్లారు. 14 మంది ప్రయాణికులను..

RTC Bus Driver: బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. సమయస్పూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించిన డ్రైవర్
Rtc Bus Driver
Follow us on

RTC Bus Driver: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ సమయ స్పూర్తితో పదుల సంఖ్యలో ప్రయాణికులు క్షేమంగా ఇంటికెళ్లారు. 14 మంది ప్రయాణికులను తీసుకుని వెళుతున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ కు అకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చాక చక్యంగా జాగ్రత్త పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ అంబర్పేట్ ప్రధాన రోడ్డుపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

వరంగల్ 2 డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి తిరిగి వరంగల్ వెళ్తుంది. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌ శ్రీనివాస్కు గుండె పోటు వచ్చింది. ఈ సమయంలో తన కర్తవ్యాన్ని మరచిపోని డ్రైవర్ బస్సును అతికష్టం మీద పక్కకు తీశాడు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఎలాంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా రోడ్డు పక్కకు నిలిపి స్టీరింగ్ మీదనే పడిపోయాడు. డ్రైవర్‌ పరిస్థితిని గమనించిన ప్రయాణికులు, కండక్టర్‌ వెంటనే స్పందించి అంబులెన్స్‌ కు సమాచారం ఇచ్చారు..అనంతరం అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్‌ స్వస్థలం అంబర్‌పేట్‌గా తెలిసింది.  సమయానికి డ్రైవర్ను హాస్పిటల్ కి తీసుకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.

Also Read:  కొడుకు పెళ్లి కానుకగా ఓ తండ్రి వినూత్న యత్నం.. సొంత ఖర్చులతో రోడ్డుకు మరమ్మత్తులు ఎక్కడంటే..

 అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో అద్భుత దృశ్యం.. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము ప్రత్యక్షం..