AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే

చరిత్రకు సజీవ సాక్ష్యం.. చెక్కు చెదరని జ్ఞాపకం.. ఆ కలెక్టర్ బంగ్లాకు 140 ఏళ్లు నిండాయి.. గంటగంటకు అలారంతో అలెర్ట్ చేస్తూ 140 ఏళ్లుగా ఎన్నో జ్ఞాపకాలను మోసుకొస్తున్న ఆ వాల్ క్లాక్ ఆ బంగ్లా చరిత్రకు మౌన సాక్షి.. ఓరుగల్లుకు ఐకాన్‌గా నిలిచిన ఆ వారసత్వ సంపద ఇప్పుడు కొత్తరూపు దిద్దుకుంటుంది.. త్వరలో ఆ కలెక్టర్ బంగ్లాలోకి మనం కూడా వెళ్లొచ్చు.. ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించిన ఆ హెరిటేజ్ బంగ్లా గురించి తెలుసుకుందాం..

అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే
Warangal Heritage Bungalow
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 26, 2026 | 11:38 AM

Share

నిజాంకాలం నాటి చారిత్రక భవనం ఇప్పుడు ఓరుగల్లుకు ఐకాన్‌గా, హెరిటేజ్ బంగ్లాగా రూపుదిద్దుకుంది. మొన్నటి వరకు కలెక్టర్లకు క్యాంపు కార్యాలయంగా ఉన్న ఈ బంగ్లా ఇకమీదట హెరిటేజ్ బంగ్లాగా మారనుంది.140 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పురాతన భవనంలో ఇప్పటి వరకు 57 మంది కలెక్టర్లు విడిది చేయడం ఓ చరిత్ర. అప్పట్లో ఓ కలెక్టర్ దెయ్యం భయంతో ఈ చారిత్రక భవనం చర్చగా మారింది.. హనుమకొండ సుబేదార్ ప్రాంతంలోని ఈ బంగ్లా 1886 ఆగస్టు 10న పరిపాలన భవనంగా అందుబాటులోకి వచ్చింది. అప్పటి నిజాం పరిపాలన సమయంలో జార్జ్ పామర్ ఈ బంగ్లాను నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమమైన ఈ బంగ్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన నుండి ఇప్పటివరకు వరంగల్‌కు వచ్చే ప్రతి కలెక్టర్ ఈ బంగ్లానే అతిథిగృతం గృహంగా ఉపయోగించే వారు..

140 ఏళ్లలో 57 మంది కలెక్టర్లు..

15 ఎకరాల విస్తీర్ణంలో, విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ చారిత్రక భవనానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బంగ్లాలో ఇప్పటి వరకు 57 మంది IAS అధికారులు కలెక్టర్లుగా కుటుంబ సమేతంగా ఉన్నారు. ఇక్కడి నుండే పరిపాలనా, కార్యకలాపాలు నిర్వహించే వారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కొత్త క్యాంపు కార్యాలయంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 140 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన బంగ్లాను హెరిటేజ్ భవనంగా మార్పు చేస్తున్నారు. ఈ బంగ్లా అభివృద్ధి పనులను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసి సందర్శకులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు..

సుబేదార్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే కనిపించే ఈ బంగ్లా ప్రధాన ద్వారం ఆకర్షణ కనిపిస్తుంది.. దానిపై 140 సంవత్సరాల క్రితమే నిజాం కాలంలో అమర్చిన ఈ వాల్ క్లాక్ గంటగంటకు ఓరుగల్లు నగర ప్రజలను అలారంతో అలర్ట్ చేస్తుంది.. అంతటి చరిత్ర కలిగిన బంగ్లా ఇది. 57 మంది కలెక్టర్లు విడిది చేసిన ఈ బంగ్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నెన్నో మధుర అనుభవాలు ఆ కలెక్టర్లు మూటకట్టుకుని వెళ్లారు. గతంలో ఒక దశలో కలెక్టర్ ఆమ్రపాలి కాటా ఇందులో దెయ్యాలు ఉన్నాయని భయాందోళన చెందడం ఒకప్పుడు తీవ్ర చర్చగా మారింది. స్వయంగా కలెక్టర్ దెయ్యం అనుభవాలు మీడియాకు వెల్లడించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది..

పూర్తిగా డంగుసున్నంతో నిర్మించిన ఈ భవనంలో విశాలమైన హాల్ , చెక్కతో నిర్మించిన మెట్లు, గాలి వెలుతురు సమృద్ధిగా వచ్చేలా నిర్మించిన ద్వారాలు, పచ్చదనం, విశాలమైన ప్రాంగణం, ఉద్యాన మనం అలనాటి రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. 140 ఏళ్లుగా ఓరుగల్లు జ్ఞాపకాలను మోసుకొస్తున్న ఈ వాల్ క్లాక్ సంథింగ్ స్పెషల్‌గా నిలుస్తుంది.

Follow Us