OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. IMDBలో 8.8 రేటింగ్.. అద్దిరిపోయే ట్విస్టులు
ఓటీటీలో మంచి ట్విస్టులున్న మలయాళం సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ థియేటర్లలో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఐ నోబడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటుమైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి. అయితే వీటి కంటే ముందు ఓ సూపర్ హిట్ సినిమా బుధవారం (ఆగస్టు 26) నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. థ్రిల్లర్, మిస్టరీ కంటెంట్ తో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 8.8 రేటింగ్ దక్కడం విశేషం. ఇన్ని విశేషాలున్న ఈ మలయాళం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. దట్టమైన అటవీ ప్రాంతం సమీపంలో ఉండే ఒక గ్రామం బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. క్రూర జంతువుల దాడి నుంచి రక్షించుకోవడానికి గ్రామస్థులు చేసే ప్రయత్నాలు, అదే సమయంలో తమ స్వార్థం కోసం అడవినే వాడుకునే కొందరు అక్రమార్కుల నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమా పేరు ‘లర్క్ – ఐస్ ఆన్ ది ప్రే’ (Lurk – Eyes on the Prey). గతంలో ‘వైరం’, ‘కినార్’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు ఎం.ఎ. నిషాద్ ఈ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. సైజు కురుప్, అనుమోల్, అజు వర్గీస్, జాఫర్ ఇడుక్కి, మంజు పిళ్లై తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..
Something is watching. Something is waiting. 👀🐅
Lurk – Eyes on the Prey streams on SunNXT from 26 Aug.@ma_nishad @saijukurup @pillai_manju @ajuvarghese @anumolofficial
[Lurk, Eyes on the Prey, Malayalam thriller, mystery movie, suspense drama, SunNXT Exclusive, forest… pic.twitter.com/8DN6vE9AQZ
— SUN NXT (@sunnxt) August 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




