Telangana: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రాజీనామాకు సిద్ధమైన వనపర్తి జడ్పీచైర్మన్‌, మరికొందరు కీలక నేతలు..

వనపర్తిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి‌ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు జడ్పీ ఛైర్మన్ లోక్‌నాధ్ రెడ్డి.

Telangana: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రాజీనామాకు సిద్ధమైన వనపర్తి జడ్పీచైర్మన్‌, మరికొందరు కీలక నేతలు..
Wanaparthy Zp Chairman

Updated on: Mar 09, 2023 | 11:00 AM

వనపర్తిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి‌ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు జడ్పీ ఛైర్మన్ లోక్‌నాధ్ రెడ్డి. ఆయనతో పాటు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్ద మందడి ఎంపీపీ మేఘారెడ్డి, సర్పంచ్‌లు, మాజీ ఎంపీపీలు, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ లు రాజీనామా చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.20 గంటలకు నేతలందరూ కుముమ్మడిగా రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు లోక్ నాధ్ రెడ్డి.

మంత్రి నిరంజన్ రెడ్డితో కొంతకాలంగా విభేదిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్ లోక్‌నాధ్ రెడ్డి. బీఆర్ఎస్ లో తమకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, అవమానాలు భరించలేకనే రాజీనామ చేస్తన్నామని, ప్రజల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు.

బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్న జడ్పీచైర్మన్ లోక్‌నాధ్ రెడ్డితో పాటు ఎంపీపీలు, సర్పంచ్ లు, మాజీ ఎంపీపీలు, మాజీ సింగిల్ విండో ఛైర్మన్లు బీజేపీలో చేరతారని టాక్ వినిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరతారనేదిపై ఫుల్ క్లారీటీ వచ్చే అవకాశం కనిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..