Vishwakarma: విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : అధ్యక్షుడు నరసింహచారి

|

Aug 21, 2021 | 3:02 PM

విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ

Vishwakarma: విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : అధ్యక్షుడు నరసింహచారి
Viswabrahmana
Follow us on

Finance Corporation – Vishwabrahmin: విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహచారి డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ సభ్యులతో పాటు నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో విశ్వబ్రాహ్మణులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు కులవృత్తుల్లో ఉన్న వారికి ప్రమాద బీమాతో పాటు ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విశ్వబ్రాహ్మణుల సంఘం డిమాండ్ చేసింది. విశ్వకర్మ స్వర్ణకార వృత్తి వారికి ఆధునిక పద్ధతిలో చేయడానికి డెవలప్‌మెంట్ పార్కును ఏర్పాటు చేయాలని విశ్వకర్మసంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించింది.