హైదరాబాద్ బిర్యానీకి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా నగరంలో బిర్యానీ ఎక్కడ బాగుంటుందని ఎవరినైనా అడిగితే వెంటనే బావర్చి రెస్టారెంట్ పేరు చెబుతారు. ముఖ్యంగా బిర్యానీ కోసం ఎక్కువగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి హోటల్ కి వెళ్లే బిర్యానీ ప్రేమికులు కూడా ఉన్నారు. అయితే ఇటీవల బిర్యానీ ఆర్డర్ చేసే సమయంలో ఆహార ప్రియులు ఆలోచించాలి అనే విధంగా కొన్ని సంఘటలు చోటు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లో ఫిష్ బిర్యానీని ఆర్డర్ చేస్తే దాని క్వాలిటీ బాగోలేదు అన్న ఫిర్యాది వినిపించింది మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీని తినాలని బావర్చి రెస్టారెంట్ కు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికీ షాక్ తలిగిలింది. వివరాల్లోకి వెళ్తే..
నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేసిన విశ్వ అనే బాలుడికి వింత అనుభవం ఎదురైంది. జొమాటో యాప్ నుంచి ఆన్‌లైన్‌లో బిర్యానీని ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ నుంచి బిర్యానీ ఆర్డర్ ను విశ్వ తీసుకున్నాడు. బిర్యానీ తినడం కోసం ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా.. అందులో చికెన్ తో పాటు బల్లి కూడా కనిపించింది. దీంతో షాక్ తిన్న బాలుడు ఆ బిర్యానీని తన తల్లి సౌమ్యకు చూపించాడు.
Nothing! Just another day in Biryani joints in Hyderabad. Lizard, cockroaches, rats….just usual biryani flavours . https://t.co/VKTgcQDBnz
— AK (@kumar_ak) December 3, 2023
వెంటనే సౌమ్య ఈ విషయాన్నీ జొమాటో కంపెనీతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి రెస్టారెంట్ సిబ్బందికి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. అయితే హోటల్ తమ ఫిర్యాదుపై స్పందించక పోవడంతో సౌమ్య తన కుటుంబంతో సహా గేట్ ముందు నిరసన తెలిపింది. బిర్యానీలో బల్లి గురించి తెలియడంతో రెస్టారెంట్ లో ఆహారం తింటున్న కస్టమర్స్ తాము తింటున్న ఆహారాన్ని వదిలి వెంటనే వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిరసనకు దిగిని ఫ్యామిలీ సహా అక్కడ ఉన్నవారిని పంపించారు. తెరచి ఉన్న హోటల్ ను మూసివేశారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలంటూ అధికారులను బాధిత ఫ్యామిలీ కోరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..