AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మొబైల్ దొంగిలించాడనే అనుమానం.. వ్యక్తిని కొట్టి చంపారు

మొబైల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాగరి రామానుజం అనే వ్యక్తిపై ఎనిమిది మంది మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. వినాయక చవితి అన్నదానం సమయంలో ఫోన్ మాయమవగా, ‘ఫైండ్ మై డివైస్’ యాప్ ద్వారా లభించిన లొకేషన్ ఆధారంగా రామానుజంపై అనుమానం పెంచుకున్నారు.

Telangana: మొబైల్ దొంగిలించాడనే అనుమానం.. వ్యక్తిని కొట్టి చంపారు
Ramanujam
P Shivteja
| Edited By: |

Updated on: Oct 02, 2026 | 7:51 PM

Share

మొబైల్ ఫోన్ దొంగిలించాడనే చిన్న అనుమానం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన దారుణ ఘటన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

వినాయక చవితి అన్నదానం సమయంలో ఫోన్ మాయం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న వినాయక చవితి సందర్భంగా అన్నదానం కార్యక్రమం జరుగుతున్న సమయంలో గుండెని ప్రవీణ్‌కు చెందిన మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దీంతో అతడు ఫోన్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 29న ‘ఫైండ్ మై డివైస్’ యాప్ ద్వారా ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేశాడు. యాప్ చూపించిన లొకేషన్ ఆధారంగా వెతకగా.. బ్యాగరి రామానుజానికి చెందిన పొలంలోని రాళ్ల మధ్య ఓ ప్లాస్టిక్ కవరులో మొబైల్ ఫోన్ లభించింది. దీంతో రామానుజమే ఫోన్‌ను దొంగిలించాడనే అనుమానం ప్రవీణ్‌తో పాటు అతని అనుచరుల్లో బలపడింది.

అర్ధరాత్రి మూకుమ్మడి దాడి

ఈ అనుమానంతో కక్ష పెంచుకున్న గుండెని ప్రవీణ్, గుండెని రమేష్, ఎంకమొల్ల రమేష్, గుండెని బాబురావు, నాగని రామానుజం, ఎంకమొల్ల ప్రశాంత్, మాసాని శ్రీను, గుండెని సత్యనారాయణ.. అర్ధరాత్రి సమయంలో బ్యాగరి రామానుజంపై దాడికి పాల్పడ్డారు. చేతులు, కాళ్లతో తన్నడంతో పాటు కర్రలతో రామానుజాన్ని విచక్షణారహితంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రామానుజం భార్య, కుమార్తె అక్కడికి చేరుకుని దాడి చేయొద్దంటూ నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా దాడి కొనసాగించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రామానుజం అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిలో ఎలాంటి కదలికలు లేకపోవడాన్ని గమనించిన నిందితులు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు.

ఎనిమిది మంది అరెస్ట్

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూప్రాన్ సీఐ వెంకటరాజాగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో అరెస్టైన వారిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు తూప్రాన్ సీఐ వెల్లడించారు. మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఎలాంటి నిర్ధారణ లేకుండానే దాడికి పాల్పడటం, చివరకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Follow Us
మొబైల్ దొంగతనం అనుమానంతో వ్యక్తి హత్య..
మొబైల్ దొంగతనం అనుమానంతో వ్యక్తి హత్య..
అబ్బో వీటి రుచి చూస్తే వదళ్లేరు.. టేస్టీ టేస్టీ కారం బోండాల తయారీ
అబ్బో వీటి రుచి చూస్తే వదళ్లేరు.. టేస్టీ టేస్టీ కారం బోండాల తయారీ
ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే మంచూరియా.. మిల్మేకర్‌తో ఎలా చేయాలంటే?
ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే మంచూరియా.. మిల్మేకర్‌తో ఎలా చేయాలంటే?
చెవి సమస్య వస్తే నడకలోనూ తేడా వస్తుంది ఎందుకో తెలుసా?
చెవి సమస్య వస్తే నడకలోనూ తేడా వస్తుంది ఎందుకో తెలుసా?
బాధితులకు భరోసా.. హిట్‌ అండ్ రన్ కేసుల్లో పరిహారం పొందడం ఎలా?
బాధితులకు భరోసా.. హిట్‌ అండ్ రన్ కేసుల్లో పరిహారం పొందడం ఎలా?
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!