PM Modi: మరింత ఆలస్యంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. తెలంగాణలో మోడీ పర్యటన వాయిదా..!

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న మోడీ హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా, మోడీ షెడ్యూల్‌లో మార్పుల కారణంగా ..

PM Modi: మరింత ఆలస్యంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. తెలంగాణలో మోడీ పర్యటన వాయిదా..!
Pm Modi

Updated on: Jan 11, 2023 | 11:30 AM

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న మోడీ హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా, మోడీ షెడ్యూల్‌లో మార్పుల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ముందు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19న మోడీ హైదరాబాద్‌ పర్యటన ఉండేది. పర్యటనలో భాగంగా పెరేడ్ గ్రౌండ్‌లో సభ కోసం ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ప్రధాని తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనుల కోసం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్‌నకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు తిరగనుంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం సందర్భంగా ప్రయాణికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మోడీ పర్యటన వాయిదా పడింది. త్వరలో పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారు అయ్యే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎంపీ లక్ష్మణ్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లు సైతం ఏర్పాట్లను పరిశీలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి