Nikitha Murder Case: నిఖిత హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన వీడియో!

Nikitha Godishala Murder Case: అమెరికాలో నిఖిత హత్య కేసులో ఆమె తండ్రి ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. నిందితుడు అర్జున్ శర్మ అరెస్టు వార్తలు అవాస్తవమన్నారు. అపోహలు నమ్మవద్దని తండ్రి విజ్ఞప్తి చేశారు. నిఖిత మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Nikitha Murder Case: నిఖిత హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన వీడియో!
Nikitha Godishala Case Update

Updated on: Jan 10, 2026 | 10:22 AM

అమెరికాలో హత్యకు గురైన నిఖిత మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కూతురు హత్య కేసుపై స్పందించిన నిఖిత తండ్రి సంచలన విషయాలు బయటపెట్టాడు. తన కుమార్తెను హత్య చేసిన నిందితుడు అర్జున్‌ శర్మ ఇంకా పరారీలోనే ఉన్నాడని.. అతన్ని ఇంటర్‌పోల్‌ అరెస్ట్‌ చేసిందనే వార్తలో నిజం లేదన్నారు. దయచేసి అపోహాలు, అవాస్తవాలను ప్రచారం చేయొద్దని నిఖిత తండ్రి రిక్వెస్ట్‌ చేశారు. నిఖిత డెడ్‌బాడీని ఇండియాకు తీసుకురావడానికి సహకరించిన వారందరికి ఆనంద్‌ ధన్యవాదాలు చెప్పారు.

అయితే ఇటీవల మాజీ ప్రియుడి చేతితో హత్యకు గురైన గొడిశాల నిఖిత మృతదేహం శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా నిఖిత మృతదేమాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గత నెల 31న మేరీ ల్యాండ్‌.. కొలంబియా ప్రాంతంలో అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్​బాడీని పోలీసులు గుర్తించారు. నిఖిత శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసినట్టు అనుమానించారు.

అయితే ఆమె హత్య అనంతరం నిందితుడు అర్జున్‌ శర్మ నిఖిత మిస్సైందని పోలీసులకు చెప్పడం, ఆ వెంటనే ఇండియాకు వచ్చేయడంతో పోలీసులు మొదట అతనిపై అనుమానం వ్యక్తి చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిఖిత- అర్జున్‌ శర్మ మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అర్జున్‌ శర్మ కోసం ఇంటర్‌పోల్‌ పోలీసులు గాలిస్తున్నారు.

వీడియో చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.