ఇరాన్ పై అమెరికా మెరుపు దాడి ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆ విమానం !

ఈ మేరకు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు ట్రంప్. విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ దాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. టెహ్రాన్ ఎలా స్పందిస్తుందోనని అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇరాన్ పై అమెరికా మెరుపు దాడి ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆ విమానం !
British Airways Plane

Updated on: Jun 22, 2025 | 1:07 PM

ఇరాన్ పై అమెరికా మెరుపు దాడి చేస్తోంది. ఈ ఘటన ప్రపంచ ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం నిలిచిపోయింది.. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లండన్‌కు వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంకు అనుమతి రాకపోవడంతో రెండు గంటలుగా రన్‌వేపైనే నిలిచిపోయింది. సిబ్బంది యుద్ధ పరిస్థితులే కారణమని వెల్లడించగా, టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు జరిపింది. ఈ మేరకు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేశామని తెలిపారు ట్రంప్. విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ దాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. టెహ్రాన్ ఎలా స్పందిస్తుందోనని అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి