
అసలే ఈ సీజన్ లేట్ అయింది. కుండపోత వర్షాలతో ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. సద్ది కట్టుకుని ఇంటిల్లిపాది పొలాల్లో దిగితేనే సాగు సాగేది. కాని, అదే సద్ది మూట పట్టుకుని ఇంటిల్లిపాది ఎరువుల దుకాణాల ముందు క్యూ కట్టాల్సి వస్తోంది. ఓవైపు కాలం వెళ్లిపోతోంది. ఇంకోవైపు యూరియా బస్తా చేతికందలేదు. సాయంత్రం దాకా క్యూలో ఉన్నందుకు ఒకట్రెండు బస్తాలొస్తే అదే గొప్ప. తెలంగాణలో ఏ గ్రామంలోని రైతును కదిపినా ఇవే కష్టాలు చెబుతున్నాడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాని యూరియా కొరత ఇప్పుడే ఎందుకొచ్చిందనేది అసలు ప్రశ్న. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. తెలంగాణలో ఒక కోటి 32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు అవుతోంది. రాష్ట్ర అవసరాలు తీరాలంటే కనీసం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని ఒక అంచనా. అయితే ఈ వానాకాలానికి గాను 10 లక్షల 40వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే సరిపోతుందని ఓ లెక్క గట్టి కేంద్రాన్ని అడిగింది రాష్ట్రం. కేంద్రం తన దగ్గరున్న స్టాక్ ఎంతో చూసుకుని ఈ వర్షాకాలానికి 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో ఈ ఆగస్ట్ నాటికి 8 లక్షల 30వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రావాల్సి ఉంది. కాని, ఇప్పటి వరకు అందింది మాత్రం 5 లక్షల 32వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే. అయితే.. ఆల్రడీ...