Hyderabad: అక్రమంగా ఆన్‌లైన్ క్లాస్ గ్రూప్‌లోకి ఎంటరైన ఓ వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుదైంది. వివరాల్లోకెళితే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల 20వ తేదీన ఓ కార్పొరేట్ స్కూల్‌లో 7వ తరగతి ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించారు. అయితే, ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ ఆన్‌లైన్ క్లాస్ లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ లింక్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఆన్‌లైన్ క్లాస్‌లో ఉపాధ్యాయురాలిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. దాంతో.. ఆ వ్యక్తిని ఆన్‌లైన్ క్లాస్ నుంచి తొలగించారు. అయితే, ఈ వివాదం జరిగిన తరువాత.. ఆ టీచర్ సంభాషణలను సదరు వ్యక్తి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దాంతో బాధిత ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందిత వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Video:
Also read:
Room Heater: రూమ్ హీటర్‌ను వినియోగిస్తున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!