ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రవాసి యోజనలో భాగంగా హైదరాబాద్ లో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఐక్య రాజ్య సమితి లో భారత్ ప్రమేయం లేకుండా ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలుత ఈసుకునే పరిస్థితి లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా కేంద్రమంత్రి పలు విమర్శలు చేశారు. కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ ఎస్ గా కాకుండా తెలంగాణ రావు సమితిగా పేరును మార్చుకోవాలని ఎద్దెవా చేశారు. కేసీఆర్ ది కుటుంబ పార్టీ అని విమర్శించారు. టిఆర్ ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు ప్రహ్లాద్ జోషి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దేశంలో అత్యంత అవినీతి గల రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు.
దోచుకొని దాచుకొని తినండి అన్నట్లు తెలంగాణ ను తయారు చేశారని ప్రహ్లాద్ జోషి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టిఆర్ ఎస్ కు తగిన గుణపాఠం చెప్తారన్నారు. టి ఆర్ ఎస్ పార్టీ మతతత్వ పార్టీ అయిన ఎం ఐ ఎంకు సరెండర్ అయిందని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల సందర్భంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తనిఖీలు నిరవ్హించారన్నారు. హిందువులు పవిత్రంగా భావిం చే తాళిబొట్టు తీయించారని, ముస్లిం లు బుర్ఖా వేసుకున్నా ఏమి అనలేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజనను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మునుగోడు ఉపఎన్నిక రానున్న తెలంగాణ రాజకీయాలకు కీలక మలుపని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఎంఐఎం ఒత్తిడితోనే పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేయడం లేదని ఆరోపించారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమాధి కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ కి భూమి కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. కేసీఆర్ కి ఏమైనా మంచి సెన్స్ ఉంటే జెపి.నడ్డా కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దివ్యాంగులతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ముచ్చటించారు. ఈసందర్భంగా కాసేపు వారితో సరదాగా గడిపారు. దివ్యాంగుల మధ్య ఉండడం, వారితో సంభాషించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కేంద్రమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల ఉన్నతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందన్నారు. దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
It was a humbling experience for me to be amongst Divyangs & interact with them at Saidabad, Hyderabad. The Govt under PM @narendramodi ji is empathetic towards the need of persons with disabilities & are committed to continue extending help to ensure a life of dignity for them. pic.twitter.com/i7ds8h3D8M
— Pralhad Joshi (@JoshiPralhad) October 21, 2022
Divine start to the day!
Began my day by taking darshan of Sri Sai Baba. Prayed for the wellbeing of Telangana and the nation. With Baba’s blessings, we will work for the development of the state. pic.twitter.com/2W5SBBfV7d
— Pralhad Joshi (@JoshiPralhad) October 21, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..