Kishan Reddy: అంబర్ పేటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర.. అధికారుల తీరుపై ఆగ్రహం..

|

Jan 23, 2023 | 1:12 PM

అధికారుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రజలు తమ...

Kishan Reddy: అంబర్ పేటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర.. అధికారుల తీరుపై ఆగ్రహం..
Union Minister Kishan Reddy
Follow us on

అధికారుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రజలు తమ సమస్యలను మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న కేంద్ర మంత్రికి విద్యుత్ సమస్య గురించి వివరించారు. అయితే.. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలని భావించిన మంత్రి అవాక్కయ్యారు. సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంపై మండి పడ్డారు సెంట్రల్ మినిస్టర్.

ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. సమస్యల పరిష్కారం కోసం తాము ప్రజల్లో తిరుగుతుంటే ‘‘మీరెక్కడ’’ అంటూ ప్రశ్నించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమాచారం ఇచ్చిన కూడా అధికారులు రాకపోతే ఎలా అని నిలదీశారు. బస్తీల్లో వాటర్ పైప్ లైన్‌ కోసం తీసిన కాలువలు పూడ్చాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..