PM MITRA: తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్కు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి..

|

Mar 17, 2023 | 6:44 PM

లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడేలా, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు..

PM MITRA: తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్కు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి..
Pm Mitra
Follow us on

తెలంగాణకు కేంద్రం మరో మెగా ప్రాజెక్టును ప్రకటించింది. లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడేలా, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్స్‌టైల్స్ రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశ్యంతో ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ & అపారెల్ పార్క్(PM-Mitra)’ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఫార్మ్ టు ఫైబర్; ఫైబర్ టు ఫ్యాక్టరీ; ఫ్యాక్టరీ టు ఫ్యాషన్; ఫ్యాషన్ టు ఫారిన్ అనే ‘5F’ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ 7 మెగా టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రకటించారు.

ప్రధాని మోదీ ప్రకటన:

కిషన్ రెడ్డి స్పందన:

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..