Kishan Reddy: మాటకు మాట.. పంచ్‌కు పంచ్‌.. సీఎం కేసీఆర్ విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ కౌంటర్..

|

Jan 18, 2023 | 8:39 PM

మాటకు మాట, పంచ్‌కు పంచ్‌, ఆయన ఒకటంటే ఈయన రెండంటారు. ఆయన విమర్శిస్తే ఈయన అంత కంటే రెట్టింపు విమర్శలు చేస్తారు. ఆయనది పవర్‌ఫుల్‌ పంచ్‌ అయితే తనది మీనింగ్‌ ఫుల్‌ మాట అంటారు.

Kishan Reddy: మాటకు మాట.. పంచ్‌కు పంచ్‌.. సీఎం కేసీఆర్ విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ కౌంటర్..
Union Minister Kishan Reddy
Follow us on

బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో ఖమ్మంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన సంధించిన ప్రతీ ప్రశ్నకు ఇటు ఢిల్లీలో జవాబిచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన ఘనత మోదీదేనని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి, కరెంట్ కోతలు నివారించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రక్షణ రంగంలో 2014 నాటికి 900 కోట్లుగా ఉన్న ఎగుమతుల్ని.

ఇవాళ రూ.15 వేల కోట్లకు చేర్చడమే కాకుండా.. 71 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని కేంద్ర మంత్రి . దేశంలో 100 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే లక్ష్యంలో భాగంగా ఇటీవల సికింద్రాబాద్ – విశాఖ మధ్య రైలును ప్రారంభించామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా సొంత టెక్నాలజీతో దీని నిర్మాణం చేపట్టామని ఆయన వెల్లడించారు.

ప్రపంచానికే ఆహారాన్ని అందించే అగ్రగామి దేశం ఇప్పుడు పిజ్జాలు, బర్గర్‌లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశం అధోగతి కాలేదని తిరిగి జవాబిచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది ప్రైవేటైజేషన్ మంత్రమనికేసీఆర్ విమర్శించారు. తాము అమ్మిన వాటి వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు కలిగిందన్నది కిషన్‌ రెడ్డి చెప్తున్న మాట. రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు, పంపకాల కోసం పేచీపై కేసీఆర్‌, కిషన్‌ రెడ్డి మాట మాట. విద్యుత్‌ విషయంలో కేసీఆర్ స్టాండ్‌ ఒకటైతే, కేంద్రంలోని బీజేపీ వైఖరి మరొకటి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం