Kishan Reddy: స్కూల్ లో టాయిలెట్లు క్లీన్ చేసిన కేంద్ర మంత్రి.. శుభ్రంగా లేకపోతే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం..

|

Dec 10, 2022 | 6:41 PM

స్వచ్ఛభారత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో హై ప్రెజర్ టాయిలెట్...

Kishan Reddy: స్కూల్ లో టాయిలెట్లు క్లీన్ చేసిన కేంద్ర మంత్రి.. శుభ్రంగా లేకపోతే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం..
Central Minister Kishan Red
Follow us on

స్వచ్ఛభారత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో హై ప్రెజర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రభుత్వ పాఠశాల్లోని టాయిలెట్లను శుభ్రం చేశారు. స్వయంగా క్లీనర్ ను చేతులతో పట్టుకుని టాయిలెట్లు క్లీన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని జామై ప్రభుత్వ పాఠశాలలో ఈ సందర్భంగా ఆయన టాయిలెట్ క్లీనింగ్ మిషన్‌తో శుభ్రం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టాయిలెట్లు శుభ్రంగా లేకుండా పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.

సర్వశిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. టాయిలెట్లు కచ్ఛితంగా ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రత్యేక నిధులు విడుదల చేస్తాం. పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్ లలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలి. మౌలిక సదుపాయాలు లేకపోయినా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తాను. టాయిలెట్స్ శుభ్రంగా లేనట్లయితే దాని ప్రభావం పిల్లల ఆరోగ్యంపై ఉంటుంది. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

       – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..