Telangana: ఈటెలతో కలిసి ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కిషన్ రెడ్డి.. భారీ జనసమీకరణకు ప్లాన్..

Telangana BJP: ఈటెల రాజేందర్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తారు. అనంతరం సభ నిర్వహణ, జన సమీకరణపై సమీక్ష నిర్వహిస్తారు.

Telangana: ఈటెలతో కలిసి ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కిషన్ రెడ్డి.. భారీ జనసమీకరణకు ప్లాన్..
Kishan Reddy, Etela
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 06, 2023 | 7:57 AM

వరంగల్, జూలై 06: తెలంగాణకు ఈ నెల 8న ప్రధనమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ప్రధాని మోదీ హనుమకొండకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి బండి సంజయ్ చీఫ్ గా ఉన్నప్పుడే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈటెల రాజేందర్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్‌కు వెళ్లనున్నారు. అనంతరం సభ నిర్వహణ, జన సమీకరణపై సమీక్ష నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం 10.35 నిమిషాలకు వరంగల్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. మొదట భద్రకాళి అమ్మావారి దర్శనం, ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంకు చేరుకొని వ్యాగెన్ మ్యానిఫ్యాక్టరింగ్, POH నిర్మాణపనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ప్రదాని మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంను పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నా ఎస్‌పీజీ భద్రతా సిబ్బంది.. అయితే, మోదీ సభను విజయవంతం చేయడానికి జనసమీకరణ సహా పలు అంశాలపై కీలకంగా దృష్టి సారించారు బీజేపీ నేతలు. అన్ని జిల్లాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణకు ప్లాన్‌ చేస్తున్నారు.

జనసమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్కడి నుంచే సభకు జనాన్ని తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. నేతలంతా వెంటనే తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం