Telangana: తెలంగాణపై బీజేపీ స్పెషల్ నజర్.. అమిత్ షా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..
Minister Amit Shah: తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ కమలం నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. అంతేకుండా రాష్ట్రంలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్‌కు రానున్నారు.
హైదరాబాద్, జూలై 27: ఇప్పటివరకూ ఒక ఎత్తు…ఇకపై మరో ఎత్తు. ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది తెలంగాణ బీజేపీ. గత వారం రోజులుగా కార్యాచరణలో స్పీడ్ పెంచారు బీజేపీ నేతలు. శ్రావణమాసంలో చేరికలు భారీగా చేరికలు వంటి వందల రోజుల ప్లాన్‌తో ముందుకెళ్తోంది టీ బీజేపీ. ఇదిలావుంటే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఫిక్స్ అయ్యింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జేఆర్‌సీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు.
అక్కడే హైదరాబాద్‌కు చెందిన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యమైన వ్యక్తులతో భేటీ ముగిసిన తర్వాత సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకుంటారు.
అక్కడ పార్టీకి చెందిన ముఖ్యమైన లీడర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీ 5:15 నుంచి 8 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. ఇదిలా ఉండగా అమిత్ షా పర్యటన సందర్భంగా ఈనెల 29న ప్రత్యేక కార్యక్రమాలకు స్థానిక బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం