ఎంఎటీఎస్…హైదరాబాద్‌లో రోజూ 2 లక్షల మంది వరకూ ప్రయాణించే రవాణా మార్గం. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడంలో ఎంఎంటీఎస్ పాత్ర చాలా కీలకం. వీటి సేవలను విస్తరించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అయితే తాజాగా కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. విస్తరణ పనులకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర సర్కారు తన వాటా విధులు విడుదల చేయడం లేదని చెప్పారు. ఈ ఏడాది MMTS కోసం రూ. 600 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వం సహకరిస్తే పనులు వేగంగా పూర్తిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్.
ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టును 2012–13లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై ఎనిమిదేండ్లు కావొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో పూర్తి కాలేదు. ఒప్పందం ప్రకారం ముూడో వంతు వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ అది చేయలేదని ఆరోపిస్తోంది కేంద్రం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపైనా స్పందించారు అశ్విని వైష్ణవ్. ఇప్పటికే దేశంలో చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నట్లు చెప్పారు. కాజీపేటకు కేటాయించిన వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ షెడ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. టెండర్లు పిలిచి.. వెంటనే నిర్మాణం మొదలుపెడుతామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..