Kumari Aunty: మా సమస్యను కూడా CM సార్ కి చెప్పండి మేడమ్‌.. కుమారి ఆంటీని మొరపెట్టుకున్న..

|

Feb 03, 2024 | 9:47 PM

కుమారీ ఆంటీ.. ఇప్పుడు సినిమా తారలను మించిన ఓ పెద్ద సెలబ్రిటీ.. మొన్నటివరకు ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు చూసే వారికి, మాదాపూర్‌ పరిసరాల్లో ఉండే వారికి మాత్రమే తెలిసిన కుమారీ ఆంటీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయింది.

Kumari Aunty: మా సమస్యను కూడా CM సార్ కి చెప్పండి మేడమ్‌.. కుమారి ఆంటీని మొరపెట్టుకున్న..
Kumari Aunty
Follow us on

కుమారీ ఆంటీ.. ఇప్పుడు సినిమా తారలను మించిన ఓ పెద్ద సెలబ్రిటీ.. మొన్నటివరకు ఇన్‌స్టా గ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు చూసే వారికి, మాదాపూర్‌ పరిసరాల్లో ఉండే వారికి మాత్రమే తెలిసిన కుమారీ ఆంటీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమె ఫుడ్‌ స్టాల్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరగడం, ఇది ట్రాఫిక్‌ సమస్యలకు దారి తీయడం, పోలీసులు ఆమె షాపును క్లోజ్‌ చేయించడం, సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం.. ఇలా ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారామె. త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్‌ను కూడా సందర్శిస్తానని రేవంత్‌ మాట కూడా ఇచ్చారని ప్రచారం జరగుతోంది. దీంతో పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌ కుమారీ ఆంటీ ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి. అయితే సోషల్‌ మీడియా క్రేజ్‌తో ఎలాంటి ఉపయోగాలున్నాయో అదే స్థాయిలో ప్రతికూల అంశాలున్నాయి. కొన్నిసార్లు కుమారీ ఆంటీకి పెరుగుతోన్న క్రేజ్‌ ఆమెకే తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

తాజాగా కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ ముందు కొందరు నిరుద్యోగులు నిరసనకు దిగారు. జీవో 46కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కుమారీ ఆంటీకి సమస్య వస్తే వెంటనే స్పందించిన సీఎం తాము 6 నెలలుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా ఆంటీ జీవో 46 రద్దు చేయమని మీరైనా ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు నిరసనకు దిగారు. ఫుడ్‌ స్టాల్‌ చుట్టూ గూమిగూడి కుమారీ ఆంటీని బాగా ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించన వీడియో సామాజి క మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరుద్యోగుల నిరసన..

మీరైనా సీఎం సార్ తో చెప్పండి మేడమ్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..