Khammam: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. షార్ట్ కట్‌లో వెళ్దామనుకొని..

|

Sep 17, 2022 | 8:39 PM

ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తూ ఎన్ఎస్‌పీ కాల్వలోకి దూసుకెళ్లింది. అనంతరం వారిద్దరూ సాగర్ కాల్వలో గల్లంతయ్యారు.

Khammam: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. షార్ట్ కట్‌లో వెళ్దామనుకొని..
Khammam Crime News
Follow us on

NSP Sagar Canal: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసకుంది. సాగర్ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో జరిగింది. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తూ ఎన్ఎస్‌పీ కాల్వలోకి దూసుకెళ్లింది. అనంతరం వారిద్దరూ సాగర్ కాల్వలో గల్లంతయ్యారు. బత్తులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేశారు. శీలం శ్రీనివాస్ రెడ్డి అలియాస్ బ్రహ్మ రెడ్డి (18), కురాకుల పవన్ కుమార్ (18) అనే ఇద్దరు విద్యార్థులు స్నేహితులు. వీరిద్దరు బైకు మీద ఆంధ్రా సరిహద్దులోని కృష్ణా జిల్లా తిరువూరుకు వెళ్దామని బయల్దేరారు. అయితే షార్ట్ కట్ రోడ్డులో వెళ్దామని సాగర్ కాలువ కట్ట మీద బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో సాగర్‌ కాల్వ రెగ్యులేటర్‌ వద్ద ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

ఈ సమయంలో అక్కడున్న గ్రామస్థులు యువకులను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండాపోయింది. ద్విచక్రవాహనాన్ని బయటకు తీసి.. గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు. గజ ఈత గాళ్ళ సాయంతో గాలిస్తున్నట్లు కల్లూరు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..