Kalthi Kallu: తెలంగాణలో కల్తీ కల్లు కోరలు చాస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో అమాయకులు కల్తీ కల్లుకు బలి అయిపోతున్నారు. ఇటీవల వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. 300 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరులో మరో దారుణం వెలుగు చూసింది. కల్తీ కల్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కల్లులో ప్రమాదకర రసాయనాలను వినియోగించడం వల్లే ఇలాంటి ఘటన జరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా.. అల్ఫ్రాజోలం, డైజోఫామ్ డోసేజ్‌ల కారణంగానే ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: