GMR Group: అదానీ, గోద్రేజ్ గ్రూప్‌లతో పోటీ పడుతోన్న జీఎంఆర్.. ముంబై రైల్వే స్టేషన్‌ అభివ‌ృద్ధి కోసం బిడ్ దాఖలు..

GMR Group: ఇప్పటి వరకు విమానాశ్రయాలు, రోడ్ల అభివృద్ధి పనులకు పరిమితమైన జీఎంఆర్ సంస్థ.. ఇప్పుడు రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.

GMR Group: అదానీ, గోద్రేజ్ గ్రూప్‌లతో పోటీ పడుతోన్న జీఎంఆర్.. ముంబై రైల్వే స్టేషన్‌ అభివ‌ృద్ధి కోసం బిడ్ దాఖలు..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 7:23 PM

GMR Group: ఇప్పటి వరకు విమానాశ్రయాలు, రోడ్ల అభివృద్ధి పనులకు పరిమితమైన జీఎంఆర్ సంస్థ.. ఇప్పుడు రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఆ దిశగా అడుగులు వేసింది. దేశంలో ప్రముఖ కంపెనీలైన అదానీ, గోద్రేజ్ గ్రూప్‌లకు పోటీగా వస్తోంది. తాజాగా మహారాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ రైల్వే స్టేషన్ నవీకరణ కోసం జీఎంఆర్ సంస్థ బిడ్‌ను దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదనీ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ కూడా బిడ్‌లను దాఖలు చేశాయి.

కాగా, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రూ. 1,642 కోట్ల అంచానతో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ రైల్వే స్టేషన్ నవీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బిడ్లను ఆహ్వానించింది. ఈ మేరకు ఐఆర్ఎస్‌డీసీ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు అదానీ గ్రూప్, గోద్రేజ్, జీఎంఆర్ సహా మొత్తం పది కంపెనీలు రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్స్ సమర్పించాయి. ఈ విషయాన్ని ఐఆర్ఎస్‌డీసీ వెల్లడించింది. కాగా, ఈ ప్రాజెక్టు కన్సెషన్ కాలపరిమితి 60 ఏళ్లు ఉంది.

Also read:

Narendra Modi: మోదీకి తెలుగంటే మక్కువా? గురజాడ పంక్తులనెందుకు కోట్ చేశారు? తెలుగుతో నరేంద్రుని అనుబంధం

రేటింగ్స్ ఏజెన్సీ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తాకు తీవ్ర అస్వస్ధత, జైలు నుంచి తరలింపు, ముంబై జేజే ఆసుపత్రిలో చేరిక,