పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పెంపుడు కుక్క పంచాయతీ.. పోలీసులు ఏం చేశారో తెలుసా..?

పెంపుడు కుక్క కోసం ఇద్దరు యువకులు ఘర్షణపడి పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగింది. ఆ ఇద్దరు ఆ కుక్క నాదంటే నాదని వాగ్వివాదానికి పోలీసులు తలలు పట్టుకున్నారు.

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పెంపుడు కుక్క పంచాయతీ.. పోలీసులు ఏం చేశారో తెలుసా..?
Pet Dog
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Sep 13, 2024 | 4:56 PM

పెంపుడు కుక్క కోసం ఇద్దరు యువకులు ఘర్షణపడి పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగింది. ఆ ఇద్దరు ఆ కుక్క నాదంటే నాదని వాగ్వివాదానికి పోలీసులు తలలు పట్టుకున్నారు. విధి లేని పరిస్థితిలో ఆ మూగ జీవిని డాగ్ ఫామ్‌కు పంపారు.

నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన సారయ్య అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఎనిమిది నెలల క్రితం మిస్సయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుక్క కోసం కుటుంబ సభ్యులు అంతా గాలించారు. కానీ ఎక్కడ ఆ కుక్క ఆచూకీ లభించలేదు. అయితే, నెల్లికుదురు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న సంచార జాతికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి వద్ద అచ్చం తనలాంటి పెంపుడు కుక్కే కనిపించింది. ఆ పెంపుడు కుక్క కూడా సారయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ తన వద్దకు వచ్చింది. ఆ కుక్క తన పెంపుడు కుక్క అని భావించిన సారయ్య తన వెంట తీసుకెళ్లాడు.

విషయం తెలుసుకున్న వెంకటేష్, కుక్కను తీసుకెళ్లిన సారయ్య వద్దకు వెళ్ళాడు. తన స్నేహితుడు పెంచుకోమని ఇచ్చిన కుక్కను నువ్వెలా తీసుకెళ్తావ్ అంటూ గొడవ పడ్డాడు. ఈ కుక్క నాదంటే, నాదంటూ ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. ఎవరికివారు నాదే అని పోలీసుల ముందు కూడా వాగ్వివాదాన్ని దిగారు. ఈ క్రమంలో ఎటు తేల్చలేకపోయిన పోలీసులు, ఈ కుక్కను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాగ్ ఫామ్ కు తరలించారు. ఆ కుక్క ఎవరిదో తెలిసేందుకు విచారణ జరుగుతుందన్నారు పోలీసులు.

వీడియో చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..