AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!

హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ సేవలు ప్రయాణ సమయాన్ని రెండు నుండి మూడు గంటలు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!
Vande Bharat
SN Pasha
|

Updated on: Sep 26, 2025 | 7:08 AM

Share

భారత ప్రభుత్వం, రైల్వే శాఖ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ రైళ్లు ఆరంభించిన కొత్తలో టిక్కెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చినా.. ప్రయాణికులు వీటిని బాగానే ఆదరిస్తున్నారు. మిగతా ట్రైన్లతో పోలీస్లే త్వరగా గమ్యస్థానలకు చేరుతుండటంతో వందే భారత్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ కొత్త సేవలు ప్రయాణ సమయాన్ని రెండు నుండి మూడు గంటలు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. నాగ్‌పూర్‌కు సర్వీస్ తర్వాత హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు ఇది మూడవ వందే భారత్ కనెక్షన్ అవుతుంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు మార్గాలను జోడించడం వలన తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడం, ప్రయాణీకుల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్-పుణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. శతాబ్ది ప్రస్తుతం దాదాపు ఎనిమిదిన్నర గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది, వారానికి ఆరు రోజులు (మంగళవారాలు తప్ప) పరిమిత స్టాప్‌లు, రెండు AC ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, తొమ్మిది AC చైర్ కార్లు, రెండు EOG కార్లతో నడుస్తుంది.

సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గాల్లో ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లకు అధిక ప్రజాదరణ లభించడంతో, ఇవి నిరంతరం అధిక ఆక్యుపెన్సీ స్థాయిలతో నడుస్తాయి. ఈ విజయంతో రైల్వే శాఖ సికింద్రాబాద్ నుండి మరో రెండు వందే భారత్ సేవలకు ప్రతిపాదనలు రూపొందించాయి, దీంతో వంద భారత్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఇది స్పష్టం చేస్తోంది. “ఈ రెండు కొత్త రైళ్ల చేరికతో, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఏడు వందే భారత్ సర్వీసులను నడుపుతోంది, ఈ స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైళ్లలో అత్యధిక సంఖ్యలో ఉన్న జోన్లలో ఒకటిగా నిలుస్తుంది. మరోవైపు సికింద్రాబాద్-ముజఫర్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒక నెలలోపు ప్రారంభం కానుంది.” అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!