Kumram Bheem Asifabad: వాగులో రెస్క్యూ సిబ్బంది గల్లంతు.. ఇరు కుటుంబాల్లో మిన్నంటిన రోదనలు

|

Jul 14, 2022 | 8:58 AM

సరకుంట గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. గ్రామంలోని పాఠశాలలో తలదాచుకున్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ టీంలోని ఇద్దరు..

Kumram Bheem Asifabad: వాగులో రెస్క్యూ సిబ్బంది గల్లంతు.. ఇరు కుటుంబాల్లో మిన్నంటిన రోదనలు
Sccl Rescue Team
Follow us on

Kumram Bheem Asifabad: వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను కాపాడటం కోసం వచ్చిన రెస్క్యూ సిబ్బంది వాగులో గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధమైంది. దాంతో గ్రామస్తులు పాఠశాలలో తలదాచుకున్నారు. ఈ మేరకు గ్రామస్తులను తరలించేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్‌ అక్కడకు చేరుకుంది. అయితే రెస్క్యూ టీంలోని ఇద్దరు వ్యక్తులు పెద్దవాగులో ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.

భారీ వర్షాలకు కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. పెసరకుంట గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. దాంతో గ్రామంలోని పాఠశాలలో తలదాచుకున్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ టీం. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్‌సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే మందమర్రి ఏరియా కు చెందిన సీహెచ్.సతీష్, రాము అనే ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు గల్లంతయ్యారు. అర్థరాత్రి కూడా గాలింపు చర్యల కొనసాగించారు.

ఐనాం మహిళకు ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆమెను కాగజ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించాలని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప SCCLని అభ్యర్థించడంతో బొగ్గు మేజర్‌ మందమర్రి ఏరియాలోని ఐదుగురు సభ్యుల బృందం దహెగావ్ మాండ్‌లోని బిబ్రా గ్రామానికి చేరుకుంది. మహిళతో పాటు ముగ్గురు సభ్యులు రోడ్డు దాటుకుని ఆమెను ఐనం గ్రామంలోని గ్రామీణ వైద్య నిపుణుడి వద్దకు చేర్చారు. అయితే పెద్దవాగు పొంగిపొర్లడంతో రోడ్డు నీటమునిగి ఉండడంతో మరోమార్గం గుండా గర్బిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా బృందంలోని చెలిక సతీష్, నంబాల రాములు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చేపట్టారు. అర్థరాత్రి కూడా గాలింపు కొనసాగింది.

ఇవి కూడా చదవండి

అయినా వారి ఆచూకీ లభించలేదు. కానీ, గురువారం తెల్లవారుజామున గల్లంతైన ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సభ్యుల మృతదేహాలు లభించినట్టుగా తెలిసింది. దాంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి