TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌.. నిందితుడు ప్రవీణ్‌ ఇంట్లో రూ.5 లక్షల నగదు సీజ్‌..

|

Mar 27, 2023 | 9:33 PM

TSPSC పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ PA తిరుపతి హస్తం కూడా ఉందని ఆరోపించిన రేవంత్‌కు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. పీఏ తిరుపతి స్వగ్రామం పోతారంలో ఎంతమంది ఎగ్జామ్‌ రాశారు..? ఎందరు క్వాలిఫై అయ్యారనేది లెక్కలతో సహా సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. మొత్తానికి టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం..

TSPSC పేపర్‌ లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌..  నిందితుడు ప్రవీణ్‌ ఇంట్లో రూ.5 లక్షల నగదు సీజ్‌..
TSPSC
Follow us on

తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో ట్విస్టు బయటకొస్తోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో డజన్‌ మందిని జైలుకు పంపిన సిట్ అధికారులు..మరో నలుగురు పాత్రదారుల్ని గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల నుంచి మహబూబ్‌నగర్‌జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు పేపర్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్‌ లీకైన ప్రశ్నాపత్రాన్ని సంపాదించి ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్ష రాసినట్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే షాద్‌నగర్‌తో చెందిన మరో ఇద్దరు కూడా ఏఈ పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తాజాగా తిరుపతి అనే వ్యక్తిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. దాంతో అరెస్టు సంఖ్య 15కి చేరింది. రేణుక భర్త డాక్యా ద్వారా తిరుపతి ఏఈ ప్రశ్నాపత్రం పొంది, దాన్ని రాజేందర్‌కి విక్రయించినట్లు సమాచారం.

TSPSC మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్​ ఇంట్లో అధికారులు 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిట్‌ అధికారులు తెలిపారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా..శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్‌వర్డ్ చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కంప్యూటర్​లో ఉన్న ప్రశ్నాపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు. రాజశేఖర్‌ ద్వారా గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్‌ పొందారు. దాంతో గ్రూప్‌-1 పరీక్ష రాయడానికి గతేడాది న్యూజిలాండ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు. దాంతో రాజశేఖర్‌ బావ ప్రశాంత్‌కు LOC నోటీసులు జారీ చేశారు సిట్‌ అధికారులు.

మరోవైపు పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ ముగ్గురు నిందితులైన షమీమ్‌, సురేష్‌, రమేష్‌ను కస్టడీకి కోరింది. మంగళవారం నాంపల్లి కోర్టు కస్టడీపై తీర్పు ఇవ్వనుంది. అటు నిందితులు కూడా బెయిల్‌కోసం కోర్టుకు అప్లై చేసుకున్నారు. ఇక ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యా, రాజేశ్వర్‌ను సిట్ విచారించింది. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం 65 మందిని విచారించారు. పరీక్షరాసిన 65 మందికి లీకేజీతో సంబంధంలేదని సిట్‌ నిర్ధారణకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఓ వైపు పేపర్‌లీక్‌ వ్యవహారంపై సిట్‌ జోరుగా దర్యాప్తు చేస్తుండగా..మరోవైపు టీఎస్‌పీఎస్సీ అధికారులు సమావేశమయ్యారు. వచ్చేనెల జరగాల్సిన పరీక్షలు, సిట్‌ దర్యాప్తు అంశాలపై చర్చించారు. ఉద్యోగుల నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు తమ మొబైల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ని ఇకపై లోపలికి తీసుకురాకుండా సెక్యూరిటీ దగ్గరే డిపాజిట్‌ చేసి విధులు నిర్వర్తించాలని టీఎస్‌పీఎస్సీ ఆదేశించింది.

TSPSC పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ PA తిరుపతి హస్తం కూడా ఉందని ఆరోపించిన రేవంత్‌కు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. పీఏ తిరుపతి స్వగ్రామం పోతారంలో ఎంతమంది ఎగ్జామ్‌ రాశారు..? ఎందరు క్వాలిఫై అయ్యారనేది లెక్కలతో సహా సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. మొత్తానికి టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం రోజుకో ట్విస్టుతో రాజకీయ దుమారం రేగుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం